News September 21, 2024

జానీ మాస్టర్ భార్య అరెస్ట్‌కు రంగం సిద్ధం?

image

TG: అత్యాచార ఆరోపణలతో అరెస్టై చంచల్‌గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ఆయన భార్య ఆయేషాను పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు యత్నించారన్న ఆరోపణలతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ యువతిని ఆయేషా బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

Similar News

News January 28, 2026

వాట్సాప్‌లో హై సెక్యూరిటీ ఫీచర్‌

image

వాట్సాప్‌ ‘స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్’ పేరిట హై సెక్యూరిటీ ఫీచర్‌‌ను తీసుకొచ్చింది. ఆల్రెడీ యాప్‌లో డిఫాల్ట్‌గా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నప్పటికీ అడిషనల్ సెక్యూరిటీ కావాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే తెలియని నంబర్ల నుంచి వచ్చే మీడియా ఫైల్స్/అటాచ్‌మెంట్లు బ్లాక్ అవుతాయి. కాల్స్ మ్యూట్ అవుతాయి(రింగ్ అవ్వదు). ఏదైనా లింక్ వస్తే థంబ్‌నెయిల్/ప్రివ్యూ డిసేబుల్ అవుతుంది.

News January 28, 2026

ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయ్యిందా?

image

సాధారణంగా కన్సీవ్ అయినపుడు ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అవ్వగానే వైద్యులను సంప్రదించాలంటున్నారు నిపుణులు. థైరాయిడ్, షుగర్, బీపీ సమస్యలు ఉంటే వాటి ప్రభావం బిడ్డపై పడుతుంది కాబట్టి వైద్యులు పరీక్షలు చేసి మందులు సూచిస్తారు. అలాగే ఇంతకు ముందు నుంచి ఏవైనా మందులు వాడుతుంటే, ఇప్పుడు కూడా అవి కొనసాగించాలా, వద్దా అనే విషయం మీద స్పష్టత ఇస్తారు. కాబట్టి ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.

News January 28, 2026

220 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

చెన్నై ఆవడిలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ 220 Jr. టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, NAC/NTC/STC అర్హతగల వారు FEB 13 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. బేసిక్ పే రూ. 21,000+IDA చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: www.ddpdoo.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.