News November 16, 2024
మెగాసిటీకి తగ్గ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం: నారాయణ

AP ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. గుంటూరులో ఓ ప్రాపర్టీ షో బ్రౌచర్ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ‘లేఔట్ అనుమతుల విషయంలో సడలింపులు తెస్తున్నాం. దేశంలోనే సరళతరమైన విధానాలు ఏపీలో తీసుకొస్తాం. రియల్ ఎస్టేట్ రంగానికి మా ప్రభుత్వం సహకరిస్తుంది. గుంటూరు, విజయవాడ, మంగళగిరి కలిసి మెగాసిటీగా మారుతాయి. అందుకు తగ్గ మాస్టర్ ప్లాన్ సిద్ధం అవుతోంది’ అని చెప్పారు.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


