News April 24, 2024

ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధం.. బీజేపీ నుంచి బహిష్కరణ

image

లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న కర్ణాటక బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్పను ఆ పార్టీ బహిష్కరించింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రకటన విడుదల చేసింది. తన కొడుక్కి పార్టీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన ఆ రాష్ట్ర మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రపై శివమొగ్గ నుంచి పోటీకి సిద్ధమయ్యారు.

Similar News

News December 26, 2025

భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL)లో ఉద్యోగాలు.. అప్లైకి 3 రోజులే సమయం

image

<>HYD<<>>లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 80 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి 3 రోజులే(DEC 29) సమయం ఉంది. అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, MSc(కెమిస్ట్రీ), MBA, CA/ICWAI, PG డిప్లొమా, M.Com ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.40,000-రూ.1,40,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: bdl-india.in

News December 26, 2025

కూరగాయల పంటకు తెగుళ్ల నుంచి సహజ రక్షణ

image

పొలం చుట్టూ, గట్ల వెంబడి ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అలాగే పొలం చుట్టూ గట్ల వెంబడి, నాటుకు కనీసం రెండు వారాల ముందు 3-4 వరుసల్లో మొక్కజొన్న పంటను కంచే పంటగా నాటుకోవాలి. దీనివలన ఈ మొక్కలు కూరగాయ పంటకు ప్రహారీలా ఉండి, పక్క పొలాల నుంచి పురుగులు రాకుండా రక్షణ కల్పిస్తాయి. మొక్కజొన్న మొక్కల్లో వచ్చిన కంకులను విక్రయించడం ద్వారా రైతుకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది.

News December 26, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండి రేటు రూ.9,000 పెరిగి రూ.2,54,000కు చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.770 పెరిగి రూ.1,40,020కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.700 పెరిగి రూ.1,28,350 పలుకుతోంది.