News August 22, 2025
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఇది చట్టం కానుండగా, ఉల్లంఘించిన వారికి మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.కోటి జరిమానా లేదా రెండూ విధించవచ్చు. రూల్స్ ఉల్లంఘించి ప్రకటనలు ఇచ్చే వారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.50లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది. ఆన్‌లైన్ గేమింగ్ మోసాలు నివారించేలా కేంద్రం దీనిని తీసుకొచ్చింది.
Similar News
News August 23, 2025
ఏంజెలినా సంచలన నిర్ణయం.. అమెరికాకు గుడ్‌బై!

ఒకప్పుడు అమెరికా అంటే ప్రతిఒక్కరి కలల ప్రపంచం. కానీ ఇప్పుడు కథ మారింది. USలో ఉండటం కంటే వేరే దేశాలకు వెళ్లిపోవడం బెటర్ అనుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే హాలీవుడ్ ప్రముఖులు రిచర్డ్ గెరె, ఎల్లెన్ డిజెనెరెస్, ఇవా లోంగోరియా వలస వెళ్లడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఆ జాబితాలో ఏంజెలినా జోలీ కూడా చేరినట్లు సమాచారం. రాజకీయ అనిశ్చితి, పెరుగుతున్న క్రైం రేట్, ఆర్థిక భారం ఈ నిర్ణయానికి కారణాలని తెలుస్తోంది.
News August 22, 2025
BREAKING: DSC మెరిట్ జాబితా విడుదల

AP: మెగా DSC మెరిట్ జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ వివరాలను అధికారిక <
News August 22, 2025
భారత్‌కు మద్దతు.. అమెరికా మాజీ NSA ఇంట్లో తనిఖీలు

INDపై ట్రంప్ టారిఫ్‌లను తప్పుబట్టిన US మాజీ జాతీయ భద్రతా సలహాదారు(NSA) జాన్ బోల్టన్ ఇంట్లో FBI తనిఖీలు చేపట్టింది. INDకు మద్దతు తెలిపిన మరునాడే ఇలా జరగడం గమనార్హం. తమ అధికారులు విధులు నిర్వర్తించారని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని FBI డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. తనిఖీలు జరుగుతున్నా జాన్ వెనక్కి తగ్గలేదు. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఉక్రెయిన్-రష్యాతో భేటీలు అవుతూనే ఉంటారని విమర్శించారు.