News December 8, 2024
17న మంగళగిరి ఎయిమ్స్కు రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 17న ఏపీలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరై ప్రసంగిస్తారు. దీంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా శీతాకాల విడిదిలో భాగంగా ముర్ము ఈ నెల 16 నుంచి 21 వరకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో బస చేయనున్నారు.
Similar News
News January 5, 2026
AERAIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<
News January 5, 2026
నీటి ప్రాజెక్టుల రుణాల కోసం CM చర్చలు

TG: ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా ముంబైలోని పెద్ద ఫైనాన్స్ కంపెనీతో CM రేవంత్, మంత్రి ఉత్తమ్ ఆదివారం మొదటి విడత చర్చలు జరిపారు. అయితే ఏ కంపెనీతో చర్చిస్తుందో వెల్లడి కాలేదు. ప్రాణహిత-చేవెళ్ల, ఇతర ప్రధాన ప్రాజెక్టుల కోసం భారీ నిధులు అవసరం. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ తరుణంలో RBIతో చర్చలకు అధికారులు సిద్ధమవుతున్నారు.
News January 5, 2026
ఒత్తిడిని వదిలి ఊరి బాట పడదాం పదండి!

ఉరుకుల పరుగుల జీవితంలో పడి కన్నవారిని, సొంతూరిని మర్చిపోతున్నాం. ఏడాదంతా బిజీగా ఉండే మనకు పండుగలే కాస్త ఉపశమనాన్నిస్తాయి. అందుకే పండుగలకైనా పట్నం వదిలి పల్లెబాట పట్టండి. తల్లిదండ్రులతో గడిపే ఆ కాస్త సమయం వారికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలనిస్తుంది. ఆత్మీయుల మధ్య సందడిగా గడపండి. కుటుంబానికి మనం ఇచ్చే ఖరీదైన కానుక వారితో గడిపే సమయమే. మరింకేం ఈ సంక్రాంతితోనే దీనిని స్టార్ట్ చేద్దామా?


