News April 30, 2024

రేపు అయోధ్యకు రాష్ట్రపతి

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు అయోధ్య బాలరాముడిని దర్శించుకుంటారని రాష్ట్రపతి భవన్ తెలిపింది. అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయం, ప్రభు శ్రీరామ్ ఆలయంలో హారతి ఇస్తారని పేర్కొంది. అలాగే సరయూ పూజ, హారతిలో పాల్గొంటారని పేర్కొంది. కాగా, రామాలయం నిర్మించిన తర్వాత రాష్ట్రపతి అయోధ్యకు వెళ్లనుండటం ఇదే తొలిసారి.

Similar News

News March 4, 2026

4 నెలల బాబుకు ప్రాణం పోశారు!

image

TG: ఆరోగ్య సమస్యలు, తక్కువ బరువు(2.8kgs)తో కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన 4నెలల బాబు ప్రాణాలను డాక్టర్లు కాపాడారు. కాలిన గాయాలు, రక్తహీనత, శ్వాస సమస్యలతో బాధపడుతున్న మడకం శివ అనే చిన్నారిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. 36 రోజుల చికిత్స తర్వాత బాలుడి బరువు 4.25kgsకి పెరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. చిన్నారికి మెరుగైన చికిత్స అందించిన డాక్టర్లపై ప్రశంసలొస్తున్నాయి.

News March 4, 2026

సౌదీపై దాడులు వద్దు.. ఇరాన్‌కు పాక్ వార్నింగ్!

image

గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్‌కు పాకిస్థాన్ వార్నింగ్ ఇచ్చింది. సౌదీ అరేబియాపై దాడులు చేయవద్దని చెప్పింది. సౌదీతో తమ రక్షణ ఒప్పందం గురించి గుర్తుచేసింది. తమకు వ్యతిరేకంగా సౌదీ భూభాగాన్ని ఉపయోగించకుండా చూడాలని ఇరాన్ తమకు చెప్పినట్లు పాక్ మంత్రి ఇషాక్‌ధర్ వెల్లడించారు. కాగా రెండు దేశాల్లో ఏ ఒక్కదానిపై దాడి జరిగినా రెండింటిపై జరిగినట్లుగా పరిగణించాలని సౌదీ-పాక్ <<17745790>>డీల్<<>> చేసుకున్న సంగతి తెలిసిందే.

News March 4, 2026

TPCC జాబితా: ఛాన్సు దక్కేదెవరికో!

image

TG: రాజ్యసభ సీటు కోసం INCలో పోటీ రసవత్తరంగా మారింది. రాష్ట్రం నుంచి సామాజిక వర్గాల వారీగా 16 పేర్లతో జాబితాను AICCకి పంపామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. వారిని ఢిల్లీకి పిలిచి మాట్లాడో లేదా ఫోన్లోనే చర్చించో తుది నిర్ణయం తీసుకోవచ్చన్నారు. కాగా VH, వేం నరేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి వంటి నేతలతో పాటు కొందరు ప్రముఖులనూ జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరికి ఛాన్సు దక్కుతుందో చూడాల్సిందే.