News September 21, 2024

శ్రీలంక‌లో ముగిసిన అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌

image

శ్రీలంక అధ్య‌క్ష ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. 2022 ఆర్థిక సంక్షోభం త‌రువాత తొలిసారిగా ఎన్నిక‌లు జ‌రిగాయి. పోలింగ్ ముగిసే స‌మ‌యానికి 70% ఓటింగ్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. అధ్య‌క్షుడు ర‌ణిల్ విక్ర‌మ సింఘె, విప‌క్ష నేత సంజిత్ ప్రేమ‌దాస‌, అనూర దిస్స‌నాయకే మ‌ధ్య త్రిముఖ పోటీ నెల‌కొంది. పోలింగ్ పూర్తైన వెంట‌నే కౌంటింగ్ కూడా ప్రారంభ‌మైంది. ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలిచినా ఆర్థిక స‌వాళ్లను ఎదుర్కోవాల్సిందే.

Similar News

News September 21, 2024

ఆ రాష్ట్రంలో చనిపోయిన వారికి పెళ్లి చేస్తారు!

image

కేరళలోని కాసరగోడ్‌లో కొన్ని వర్గాల్లో ఓ విచిత్ర ఆచారం ఉంది. పెళ్లికాకుండానే చనిపోయిన యువతీయువకులకు వారి కుటుంబీకులు పెళ్లి చేస్తారు. అయితే వారిద్దరి స్థానంలో బొమ్మల్ని ఉంచుతారు. వివాహ ఆహ్వానం నుంచి మొదలు అన్ని తతంగాలూ నిజమైన పెళ్లిలాగే జరుపుతారు. పెళ్లైన తర్వాత ఇరు కుటుంబాలు చుట్టాలుగా కొనసాగుతాయి. పెళ్లి ఘట్టం లేకుండా కన్నుమూసిన తమ బిడ్డల ఆత్మలు ఈ విధంగా శాంతిస్తాయనేది వారి నమ్మకం.

News September 21, 2024

NTR ‘దేవర’ సినిమాకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

image

AP: రాజకీయాలకు అతీతంగా తెలుగు చిత్ర సీమకు మంచి జరగాలని చంద్రబాబు కూటమి నాయకత్వం కోరుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. దేవర సినిమాకు టికెట్ల పెంపుపై ఆయన స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వంలో సినీ నిర్మాతలు, నటులు పడిన కష్టాలు తనకు వ్యక్తిగతంగా తెలుసని చెప్పారు. తామెప్పుడూ సినీ పరిశ్రమను వైసీపీ నేతల్లా ఇబ్బందులకు గురిచేయబోమని పేర్కొన్నారు. దేవర విడుదలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

News September 21, 2024

మాధ‌బి స‌మాచారం ఇచ్చేందుకు సెబీ నిరాకరణ

image

త‌మ ఛైర్మ‌న్ మాధ‌బికి సంబంధించిన వివ‌రాల‌ను బ‌హిర్గతం చేయ‌డానికి సెబీ నిరాక‌రించింది. ఆస్తులు, ఈక్విటీల‌పై మాధ‌బీ స‌మ‌ర్పించిన డిక్ల‌రేష‌న్ల‌ను బ‌హిర్గతం చేయ‌డం ఆమె వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌ను ప్ర‌మాదంలో ప‌డేసిన‌ట్టే అవుతుంద‌ని RTI దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కార‌ణంగా ఆమె త‌ప్పుకున్న కేసుల వివ‌రాలు అందుబాటులో లేవని, వాటిని క్రోడీక‌రించ‌డానికి అధిక సమయం పడుతుందని తెలిపింది.