News April 12, 2024
త్వరలోనే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన?

లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో ఢిల్లీలో త్వరలోనే కేంద్రం రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు తెలుస్తోంది. తమకు రాష్ట్రపతి పాలనపై విశ్వసనీయ సమాచారం ఉందని ఆప్ మంత్రి ఆతిశీ అన్నారు. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి అధికారుల బదిలీలు, నియామకాలు లేవన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారులు హాజరుకావడం లేదని ఆమె పేర్కొన్నారు. కాగా.. ఆమె ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది.
Similar News
News March 26, 2026
పెట్రోల్ సమస్య.. వారికి వర్క్ ఫ్రమ్ హోమ్!

హైదరాబాద్‌లో పెట్రోల్ సమస్యతో కొన్ని IT కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మొదలుపెట్టాయి. విప్రో, యాక్సెంచర్, TCS వంటి పెద్ద కంపెనీలు ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పిస్తుండగా, మరికొన్ని సంస్థలు 50-50 విధానం తీసుకొచ్చాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉంది. HYDలో దాదాపు 9.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా అందులో సగం మంది బైకులు, కార్లలో రాకపోకలు సాగిస్తారని సమాచారం.
News March 26, 2026
ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ లాంచ్?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 25న అధికారికంగా పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా, గుర్తుగా ‘ధర్మగంట’ను ఎంచుకున్నట్లు టాక్. రేపు నిజామాబాద్‌లో జరిగే సమావేశంలో దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులో OBC మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.
News March 26, 2026
2 రోజుల్లో రూ.15.80 లక్షల కోట్ల లాభం

యుద్ధ మేఘాలు తొలగిపోతున్నాయన్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం రికార్డు స్థాయిలో రాణించాయి. కేవలం 2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.15.80 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం సెన్సెక్స్ 1,205 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు ఎగబాకాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు దీనికి ప్రధాన కారణం. శ్రీరామ నవమి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు.


