News June 27, 2024

నేడు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం

image

కొత్తగా కొలువుదీరిన లోక్‌సభతో పాటు రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చే ముర్ముకు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ స్వాగతం పలుకుతారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 87ప్రకారం లోక్‌సభ కొత్తగా కొలువుదీరిన ప్రతిసారీ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది.

Similar News

News December 9, 2025

గ్లోబల్ సమ్మిట్@ రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు

image

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. 2 రోజుల పాటు జరిగిన సదస్సులో మొత్తంగా ₹5.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి రోజు ₹2,43,000 కోట్ల ఒప్పందాలు జరగ్గా మిగతా పెట్టుబడులపై 2వ రోజు MOUలు కుదిరాయి. విద్యుత్ రంగంలో ₹3,24,698 కోట్లు, AI, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ వంటి రంగాల్లో ₹70,000 కోట్ల ఒప్పందాలు కుదిరాయి.

News December 9, 2025

పీకల్లోతు కష్టాల్లో భారత్

image

కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి T20లో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన IND మూడో బంతికే వైస్ కెప్టెన్ గిల్(4) వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్(12) కూడా ఎంగిడి బౌలింగ్‌లోనే గిల్ తరహాలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. అభిషేక్(17) దూకుడుకు బౌలర్ సిపామ్లా బ్రేకులేశారు. IND స్కోర్ 7 ఓవర్లలో 50/3.

News December 9, 2025

తెలంగాణకు పెట్టుబడుల ‘పవర్’

image

TG: గ్లోబల్ సమ్మిట్‌లో పవర్(విద్యుత్) సెక్టార్‌కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. మొత్తం రూ.3,24,698 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా 1,40,500 ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జెన్‌కో, రెడ్కో, సింగరేణి సంస్థలు వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నాయని వెల్లడించారు.