News December 27, 2024
విమానంలోనే ప్రెస్‌మీట్.. ఇది మన్మోహన్ స్టైల్

సైలెంట్ ప్రైమ్ మినిస్టర్ అంటూ తనను ప్రస్తావించడాన్ని మన్మోహన్ సింగ్ ఖండించేవారు. తాను మిగతావారిలా మీడియాతో మాట్లాడేందుకు భయపడేవాడిని కాదని చెప్పేవారు. విదేశీ పర్యటనలు ముగించి వచ్చేటపుడు ఆయన విమానంలోనే ప్రెస్ మీట్ నిర్వహించేవారు. ఏ అంశాన్ని మీడియా లేవనెత్తినా అనర్గళంగా మాట్లాడేవారు. 2004-2014 మధ్య కాలంలో ఆయన ప్రధానిగా 117 సార్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. విదేశాల్లోనూ ప్రెస్‌తో మాట్లాడేవారు.
Similar News
News February 3, 2026
APSRTC కోసం 2,500 కొత్త బస్సులు

AP: ఈ ఏడాది చివరి నాటికి 2,500 ఎలక్ట్రిక్/CNG బస్సులను కొనుగోలు చేస్తామని RTC ఇన్‌ఛార్జ్ MD కృష్ణబాబు తెలిపారు. PM ఈ-బస్ పథకం కింద 1050 విద్యుత్ బస్సులు రానున్నాయని, అదనంగా మరో 1450 ఎలక్ట్రిక్, CNG బస్సులను ప్రవేశపెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. RTCలో డ్రైవర్లతో పాటుగా ఇతర నియామకాలను చేపడతామని, ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు EHSను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.
News February 3, 2026
సమీకృత వ్యవసాయ విధానాలు (మోడల్స్)

☛ పంటలు + పశువులు +జీవాల పెంపకం.
☛ పంటలు + పశువులు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపల పెంపకం
☛ పంటలు + పశువులు + కోళ్లు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపలు + పుట్టగొడుగుల పెంపకం
☛ పంటలు + పశువులు + వర్మీ కంపోస్ట్ + చేపల పెంపకం
☛ పశువులు+ జీవాలు + కోళ్ల పెంపకం.. వాతావరణం, రైతు స్థితి, సహజ వనరులను బట్టి సమగ్ర వ్యవసాయ అనుబంధ రంగాలను ఎంచుకోవచ్చు.
News February 3, 2026
APPLY NOW: 28,740 ప్రభుత్వ ఉద్యోగాలు

పోస్టాఫీసుల్లో 28,740 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నోటిఫికేషన్‌తో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. APలో 1060, TGలో 609 పోస్టులు ఉన్నాయి. <


