News August 27, 2024
రేపు ఉదయం ప్రెస్ మీట్.. సాయంత్రం హైదరాబాద్కు రాక

TG: బెయిల్పై విడుదలైన BRS MLC కల్వకుంట్ల కవిత రేపు హైదరాబాద్ రానున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ఆమె జైలు నుంచి విడుదలవుతారు. ఈ రాత్రికి ఆమె ఢిల్లీలోనే బస చేసి, రేపు ఉదయం బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అనంతరం ఆమె విమానంలో రాష్ట్రానికి చేరుకుంటారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై 5 నెలలుగా కవిత తిహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
Similar News
News November 18, 2025
హనుమాన్ చాలీసా భావం – 13

సహస్ బదన్ తుమ్హారో యశగావై|
అసకహి శ్రీపతి కంఠ లగావై||
వేయి తలలు కలిగిన ఆదిశేషుడు కూడా ఆంజనేయుడి కీర్తిని గానం చేశాడు. శ్రీరాముడు ఆయనను ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. ఈ నిష్కళంక సేవ, సాటిలేని భక్తి చాలా గొప్పది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ప్రశంసించి ఆలింగనం చేసుకోవడం భగవంతుని దయ, ప్రేమ పొందడానికి భక్తే ఉత్తమ మార్గమని, శ్రేయస్కరమని హనుమంతుడు నిరూపించాడు. <<-se>>#HANUMANCHALISA<<>>

BREAKING: భారీ అగ్ని ప్రమాదం

TG: మహబూబ్నగర్లోని గొల్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.