News March 23, 2025
KCRకు దొంగ నోట్లు ముద్రించే ప్రెస్: బండి సంజయ్

TG: మాజీ సీఎం కేసీఆర్‌కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నకిలీ నోట్లనే ఓటర్లకు పంచారన్నారు. ప్రస్తుతం భూములు అమ్మితే గానీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. అలాగే రాష్ట్రంలో ప్రతి పనికీ కమీషన్ల వ్యవహారం నడుస్తోందని విమర్శించారు.
Similar News
News March 25, 2025
రేపు OTTలోకి వచ్చేస్తున్న ‘ముఫాసా’

ది లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘ముఫాసా’ మూవీ రేపు ఓటీటీలోకి రానుంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. కాగా తెలుగులో ముఫాసాకు మహేశ్ బాబు, హిందీలో షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. డిస్నీ రూపొందించిన ఈ మ్యూజికల్ లైవ్ యాక్షన్ మూవీ గతేడాది విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
News March 25, 2025
జపాన్‌లో ఎన్టీఆర్ బిజీ బిజీ!

జపాన్‌లో ‘దేవర’ సినిమా విడుదల నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. నిన్న స్పెషల్ స్క్రీనింగ్‌లో పాల్గొన్న ‘దేవర’.. అక్కడున్న అభిమానులతో స్టెప్పులేశారు. రెండో రోజూ ఆయన షినాగావా అక్వేరియంను సందర్శించారు. అక్కడున్న షార్క్‌లతో ఫొటోలు దిగుతూ కనిపించారు. క్లాసీ లుక్‌లో ఉన్న ఎన్టీఆర్ ఫొటోలు వైరలవుతున్నాయి.
News March 25, 2025
సంచలన ఆరోపణలు: పోలీసుల కనుసన్నల్లో IPL బెట్టింగ్?

మహారాష్ట్ర ప్రతిపక్ష శివసేన(UBT) నేత అంబాదాస్ దాన్వే మండలిలో సంచలన ఆరోపణలు చేశారు. ముంబై పోలీసుల కనుసన్నల్లో భారీగా బెట్టింగ్ సాగుతోందన్నారు. తన వద్ద పెన్‌డ్రైవ్‌లో ఆధారాలున్నాయని, త్వరలోనే బయటపెడతానని చెప్పారు. ‘పోలీసు ఉన్నతాధికారులతో కలిసి కొంతమంది ఐపీఎల్ బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు. పాకిస్థానీ క్రికెటర్లతో వీరంతా టచ్‌లో ఉన్నారు. ముంబై పోలీసులు ఈ ముఠాని కాపాడుతున్నారు’ అని పేర్కొన్నారు.