News April 24, 2024

130 సార్లు బటన్ నొక్కాం: జగన్

image

AP: 58 నెలల తన పరిపాలనలో 130 సార్లు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాల నగదు జమ చేశామని CM జగన్ తెలిపారు. విజయనగరం(D) చెల్లూరు సభలో మాట్లాడిన ఆయన.. ‘జగన్ ఒక్కడే ఒకవైపు. తోడేళ్లన్నీ మరోవైపు. మోసాల బాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలి. ప్రజల డ్రీమ్స్‌ను నా స్కీమ్స్‌గా అమలు చేస్తున్నా. పేదలను దోచుకునేందుకు, వాళ్ల రక్తం తాగేందుకు చంద్రముఖి ముఠా మళ్లీ వస్తోంది’ అని విమర్శించారు.

Similar News

News January 2, 2026

APPLY NOW: బాల్మర్ లారీలో ఉద్యోగాలు

image

బాల్మర్ లారీ‌లో 18 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(JAN 4) ఆఖరు తేదీ. పోస్టును బట్టి MTM, MBA, BE/B.Tech,డిగ్రీ, MCA ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.balmerlawrie.com

News January 2, 2026

ఏపీలో పెరిగిన GST వసూళ్లు

image

AP: డిసెంబర్‌లో రాష్ట్ర GST వసూళ్లు పెరిగాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 5.78% ఎక్కువగా రూ.2,652 కోట్లు వసూలైంది. జాతీయ సగటును (5.61%) సైతం మించింది. దీంతో దక్షిణాదిలో తమిళనాడు తర్వాత రెండో స్థానంలో నిలిచింది. స్థూల వసూళ్లు రూ.3,137 కోట్లకు చేరాయి. SGST, IGST, పెట్రోలియం వ్యాట్‌, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆదాయాలు కూడా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.39,517 కోట్ల పన్ను ఆదాయం వచ్చింది.

News January 2, 2026

అన్వేష్‌ ఐడీ వివరాలు కోరుతూ ఇన్‌స్టాకు పోలీసుల లేఖ

image

యూట్యూబర్ <<18719766>>అన్వేష్‌కు<<>> హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. విదేశాల్లోని అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అన్వేష్ యూజర్ ఐడీ వివరాలు కావాలని పంజాగుట్ట పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌కు లెటర్ రాశారు. అన్వేష్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాగా హిందూ దేవతలను కించపరిచారని బీజేపీ నేత కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. అతడిపై హిందూసంఘాలు మండిపడుతున్నాయి.