News September 20, 2024

తిరుమల ఆలయ ప్రతిష్ఠను కాపాడాలి: టీటీడీ ఈఓ

image

AP: తిరుమల ఆలయ ప్రతిష్ఠను భక్తులు, ప్రజలు కాపాడాలని టీటీడీ ఈఓ శ్యామలరావు కోరారు. శ్రీవారి లడ్డూ వివాదంపై ఈఓ స్పందించారు. ‘రికార్డుల్లో లడ్డూ తయారీకి స్వచ్ఛమైన నెయ్యిని వాడాలని ఉంది. నెయ్యి నాణ్యతను పరీక్షించే పరికరాలను గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ విరాళంగా ఇచ్చింది. వాటితోనే నెయ్యి నాణ్యతను పరీక్షిస్తున్నాం. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 20, 2024

సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం

image

బెంగాల్ కోర్టులను ఉద్దేశించి CBI చేసిన వ్యాఖ్య‌ల‌పై సుప్రీంకోర్టు మండిపడింది. 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం జ‌రిగిన హింసాకాండ కేసుల‌ను CBI విచారిస్తోంది. రాష్ట్రంలో సాక్షులను బెదిరించే ఆస్కారం ఉందంటూ కేసులను బ‌దిలీ చేయాలని CBI పిటిష‌న్ వేసింది. అయితే ఇందులో బెంగాల్‌లోని కోర్టులు నిష్ప‌క్ష‌పాతంగా ఉండ‌వంటూ రాసిన వ్యాఖ్యానాల‌పై కోర్టు మండిప‌డింది. దీన్ని సవరిస్తేనే కేసును విచారిస్తామంది.

News September 20, 2024

ఈనెల 23 నుంచి ‘హరిహర వీరమల్లు’ షూటింగ్

image

‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ ఈనెల 23 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే రోజు నుంచి పవన్ కళ్యాణ్ షూట్‌లో పాల్గొంటారని, హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ సమక్షంలో యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నట్లు తెలిపారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ మూవీలో కొంత భాగానికి క్రిష్ దర్శకత్వం వహించగా, మిగిలిన భాగానికి జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయనున్నారు.

News September 20, 2024

సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా: సీఎం రేవంత్

image

TG: దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అలాగే లాభాల్లో కూడా వాటా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ‘మొత్తం 25 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షల చొప్పున ఇస్తున్నాం. ఇందుకోసం రూ.796 కోట్లు కేటాయించాం. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం. కార్మికులు, ఉద్యోగుల కళ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.