News December 13, 2024
పెదవుల పగుళ్లను నివారించండిలా!

చలికాలంలో ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య పెదవుల పగుళ్లు. రాత్రి పడుకునే ముందు పాలతో పెదవులను మర్దన చేసుకొని మార్నింగ్ లేవగానే కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కొబ్బరి నూనె, ఆ నూనెతో తయారు చేసిన లిప్ బామ్స్ కూడా పగుళ్లను నివారిస్తాయి. తేనె కూడా పెదవుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రాత్రి పూట రాసి ఉదయాన్నే కడిగితే పెదవులు మృదువుగా మారిపోతాయి. వీటితో పాటు తగినంత నీటిని తాగడం ముఖ్యం.
Similar News
News January 16, 2026
T20 వరల్డ్‌కప్‌లో సుందర్ ఆడటం కష్టమే!

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి ఇప్పటికీ కోలుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో చివరి రెండు వన్డేలకు దూరమైన సుందర్, ఇప్పుడు టీ20లకూ అందుబాటులో లేరు. ఈ విషయాన్ని ఇటీవల బీసీసీఐ తెలిపింది. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే T20 వరల్డ్‌కప్‌కు కూడా పూర్తి ఫిట్నెస్ సాధించడం కష్టమని నివేదికలు చెబుతున్నాయి. దీంతో జట్టులో ఆయన స్థానం అనుమానంగానే మారింది.
News January 16, 2026
గ్రీన్లాండ్కు భారీగా యూరోపియన్ సైనిక బలగాలు

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని US అధ్యక్షుడు ట్రంప్ <<18784880>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో యూరోపియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. డెన్మార్క్‌కు మద్దతుగా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నార్వే సహా పలు దేశాలు గ్రీన్లాండ్కు సైనిక బలగాలను పంపుతున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్ సైనికులు గ్రీన్లాండ్ రాజధాని నూక్ చేరుకోగా, జర్మనీ సైతం సైనిక బృందాన్ని మోహరించింది. నాటో దేశాల ఐక్యతను చూపించేందుకే ఈ బలగాల మోహరింపు అని సమాచారం.
News January 16, 2026
సాగులో అండగా నిలిచే గోవులను ఇలా పూజిద్దాం

కనుమ రోజున ఆవులను, ఎడ్లను నదులు, చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తే ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చంటారు.


