News March 21, 2024
ఈడీ అరెస్టును అడ్డుకోండి.. హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్

లిక్కర్ స్కామ్ కేసులో తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీని ఆదేశించాలంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేయగా, ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని, రక్షణ కల్పిస్తే కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు.
Similar News
News September 10, 2025
శుభ సమయం (10-09-2025) బుధవారం

✒ తిథి: బహుళ తదియ సా.6.25 వరకు
✒ నక్షత్రం: రేవతి రా.7.44 వరకు
✒ శుభ సమయములు: ఉ.9.45-ఉ.10.10, సా.4.10-సా.5.10
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.7.30-ఉ.9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
✒ వర్జ్యం: ఉ.8.25-ఉ.9.56
✒ అమృత ఘడియలు: సా.5.28-సా.6.58
News September 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 10, 2025
ఆసియా కప్: హాంకాంగ్‌పై అఫ్గాన్ విజయం

ఆసియా కప్-2025 తొలి మ్యాచులో హాంకాంగ్‌పై అఫ్గానిస్థాన్ 94 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 188/6 స్కోర్ చేసింది. సెదిఖుల్లా అటల్ (73), అజ్మతుల్లా (53) రాణించారు. అనంతరం ఛేదనలో హాంకాంగ్ 20 ఓవర్లలో 94-9 స్కోర్ మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాటర్లలో బాబర్ హయత్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచారు.