News November 20, 2024
గత పాలకులు తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టలేదు: పవన్
AP: ప్రజారోగ్య పరిరక్షణ, కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని డిప్యూటీ CM పవన్ అన్నారు. గత ప్రభుత్వం గ్రామానికి రూ.4లక్షల ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగునీరు అంది ఉండేదన్నారు. వారి నిర్లక్ష్యంతో రంగు మారిన నీరు పైపుల ద్వారా వెళ్లిందని, గుడివాడలో ఈ సమస్య తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరించామన్నారు. గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ నిర్దేశిత టైంలోగా మార్చాలని ఆదేశించారు.
Similar News
News November 20, 2024
నేడు వేములవాడకు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు వెళ్లనున్నారు. ఉ.10:10 నుంచి ఉ.11.45 గంటల మధ్యలో వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులు, మిడ్ మానేరు నిర్వాసితుల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మ.1.45 తర్వాత HYDకు తిరుగు ప్రయాణమవుతారు.
News November 20, 2024
విడాకులపై ఏఆర్.రెహమాన్ ట్వీట్.. ఏమన్నారంటే?
భార్యతో విడాకులు తీసుకోవడంపై ఏఆర్.రెహమాన్ ట్వీట్ చేశారు. ‘మేము మా బంధంలో ముప్పై ఏళ్లు పూర్తి చేసుకోవాలనుకున్నాం. కానీ ఊహించని విధంగా ఇది ముగిసింది. విరిగిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుంది. విడిపోవడంలోనూ మేము అర్థాన్ని వెతుకుతాము. అయినప్పటికీ పగిలిన ముక్కలు మళ్లీ ఒక్కటి కాలేకపోవచ్చు. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించినందుకు అందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
News November 20, 2024
ఓపెనర్‌గా KL? మూడో స్థానంలో పడిక్కల్?
BGT తొలి టెస్టులో జైస్వాల్‌కు జోడీగా KL రాహుల్ ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉందని espncricinfo పేర్కొంది. మూడో స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్, నాలుగో స్థానంలో కోహ్లీ, ఐదో స్థానంలో పంత్ ఆడతారని తెలిపింది. ఆరో స్థానం కోసం సర్ఫరాజ్, జురెల్ మధ్య పోటీ ఉందని, ఆల్‌రౌండర్ కోటాలో నితీశ్, అశ్విన్‌కు చోటు దక్కొచ్చని పేర్కొంది. పేసర్లలో బుమ్రాతో పాటు హర్షిత్ రాణా, సిరాజ్/ఆకాశ్‌దీప్ ఆడొచ్చని అంచనా వేసింది.