News October 14, 2024

సెప్టెంబర్‌లో సామాన్యుడిపై ధ‌ర‌ల మోత‌

image

వ‌స్తు, సేవ‌ల ధ‌ర‌లు ఈ ఏడాది సెప్టెంబర్‌లో సామాన్యుడి న‌డ్డివిరిచాయి. రిటైల్ ద్రవ్యోల్బణం దేశంలో గత ఏడాది Sepతో పోలిస్తే 5.49 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణ రేటు 5.87% వద్ద ఉంటే, పట్టణ ప్రాంతాల్లో మాత్రం 5.05%గా నమోదైంది. వినియోగదారుల ఆహార ధరల సూచీ (CFPI) ద్రవ్యోల్బణం 9.24 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ధరలు 9.08%, పట్ట‌ణాల్లో 9.56% అధికమయ్యాయి.

Similar News

News October 14, 2024

కుంగిన రైల్వే ట్రాక్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

image

AP: గుంటూరు జిల్లా పొన్నూరు(మ) మాచవరం వద్ద ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైల్వే ట్రాక్ కుంగింది. దీంతో విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో మాచవరం చేరుకున్న తిరుపతి-హైదరాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఇబ్బంది తలెత్తగా, రైలును వెనక్కి మళ్లించి 3వ రైల్వే లైన్ ద్వారా HYD పంపించారు. మాచవరంలో ట్రాక్‌కు అధికారులు మరమ్మతులు చేపట్టారు.

News October 14, 2024

రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని అన్ని స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్లు వెల్లడించారు. సంక్షేమ హాస్టళ్లు ప్రమాదకర స్థితిలో ఉంటే వాటిల్లో ఉంటున్న విద్యార్థులను సమీపంలోని సురక్షిత భవనాల్లోకి తరలించాలని సూచించారు. అటు వారం రోజుల్లో ప్రసవించే అవకాశం ఉన్న గర్భిణులను ఆస్పత్రుల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.

News October 14, 2024

మునావ‌ర్ ఫారూఖీ హ‌త్య కుట్ర.. భ‌గ్నం!

image

స్టాండ‌ప్ క‌మేడియ‌న్ మునావ‌ర్ ఫారూఖీ హ‌త్య‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ Sepలో చేసిన కుట్ర‌ను నిఘా వ‌ర్గాలు భ‌గ్నం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఢిల్లీలో జ‌రిగిన ఓ కాల్పుల కేసు విచారణలో ఈ కుట్ర వివరాలు వెలుగుచూశాయి. అయితే, అప్పటికే ఢిల్లీ వెళ్తున్న మునావర్‌పై విమానంలో, హోట‌ల్‌లో రెక్కీ జ‌రిగిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఇది కచ్చితంగా అతని హత్యకు జరిగిన కుట్రగా భావించి మునావర్‌ను అక్కడి నుంచి తప్పించారు.