News September 16, 2025

రూ.2 లక్షల వరకు ధరలు తగ్గింపు

image

ప్రీ GST, పండుగ డిస్కౌంట్ కింద కార్ల కంపెనీ కియా ఇండియా తెలుగు రాష్ట్రాల ప్రజలకు రూ.2 లక్షల వరకు ఆఫర్ ప్రకటించింది. సెల్టోస్ మోడల్‌పై రూ.2 లక్షలు, కారెన్స్ క్లావిస్‌పై రూ.1.33 లక్షలు, కారెన్స్‌పై రూ.1.02 లక్షల తగ్గింపు పొందవచ్చని పేర్కొంది. సెప్టెంబర్ 22 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఆఫర్ ఉందని, అయితే ధరల్లో మార్పు ఉంటుందని వెల్లడించింది.

Similar News

News February 2, 2026

900 మంది టీచర్ల కుటుంబాలకు జరగని న్యాయం!

image

AP: విధుల్లో ఉండగా 2019-2025 మధ్య అకాల మరణం పొందిన 900 మంది టీచర్ల కుటుంబాల్లో ఇంకా అంధకారం తొలగలేదు. చనిపోయిన వారి పిల్లల్లో ఒకరికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. కానీ ఆరేళ్లుగా అధికారులను కలుస్తున్నా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ‘6 నెలల కిందట Dy.CM పవన్‌ను కలవగా ఆయన CMOకు లెటర్ పంపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News February 2, 2026

ఐసీసీ టోర్నీల్లో గతంలోనూ బహిష్కరణలు

image

భారత్‌తో జరగాల్సిన వరల్డ్ కప్ మ్యాచ్‌ను పాక్ ప్రభుత్వం బాయ్‌కాట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్‌ టోర్నీలలో మ్యాచ్‌లు రద్దవ్వడం కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 1996 వరల్డ్‌కప్‌లో భద్రతా కారణాలతో శ్రీలంకలో ఆడేందుకు ఆసీస్, వెస్టిండీస్ నిరాకరించాయి. దీంతో శ్రీలంకకు వాకోవర్ లభించింది. 2003 WCలో జింబాబ్వేతో మ్యాచ్‌ను ఇంగ్లండ్, కెన్యాతో మ్యాచ్‌ను న్యూజిలాండ్ బహిష్కరించాయి.

News February 2, 2026

రెబల్‌గా పోటీ చేస్తే 15 ఏళ్లపాటు సస్పెన్షన్: రాంచందర్ రావు

image

TG: మున్సి‘పోల్స్’లో పార్టీ B ఫారం పొందిన వారే పోటీలో ఉండాలని, పార్టీ ఇతర నేతలు బరి నుంచి తప్పుకోవాలని TBJP చీఫ్ రాంచందర్ రావు సూచించారు. పోటీలో కొనసాగే రెబల్స్‌ను 15 ఏళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అనేక సర్వే నివేదికల ఆధారంగా గెలిచే వారినే అభ్యర్థులుగా పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. టికెట్లు రాని వారికి పార్టీ పరంగా పదవులు ఇస్తామని వివరించారు.