News June 24, 2024
GST వచ్చాక ధరలు తగ్గాయి: ప్రధాని మోదీ

GST అమల్లోకి వచ్చిన తర్వాత గృహావసర వస్తువులు చౌకగా మారాయని ప్రధాని మోదీ అన్నారు. GST వల్ల పేదలు, సామాన్యుల పొదుపులో వృద్ధి కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రజల జీవితాలను మార్చేందుకు ఈ సంస్కరణలను కొనసాగిస్తామని తెలిపారు. తమ దృష్టిలో సంస్కరణలు అంటే 140 కోట్ల మంది భారతీయుల జీవితాలను మెరుగుపరచడానికి ఒక సాధనం అని ఆయన అభివర్ణించారు.
Similar News
News November 28, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత

AP: తుఫాన్ కారణంగా రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలకు హోంమంత్రి అనిత సూచనలు చేశారు. సోమవారం వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్ష ప్రభావం అధికంగా ఉండే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉంచాలన్నారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు.
News November 28, 2025
ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ కాదు: UP

ఆధార్ కార్డు విషయంలో అన్ని విభాగాలకు ఉత్తర్‌ప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కీలక ఆదేశాలిచ్చింది. ఇకపై ఆధార్ కార్డును బర్త్ సర్టిఫికెట్‌గా, ప్రూఫ్ ఆఫ్ బర్త్‌గా గుర్తించడానికి వీల్లేదని పేర్కొంది. ‘ఆధార్‌కు జనన ధ్రువీకరణ పత్రం జత చేయరు. కాబట్టి ఇకపై దానిని బర్త్ సర్టిఫికెట్‌గా గుర్తించేందుకు వీల్లేదు’ అని ప్లానింగ్ విభాగం ప్రత్యేక కార్యదర్శి అమిత్ సింగ్ బన్సాల్ ఆదేశాలు జారీ చేశారు.
News November 28, 2025
శరవేగంగా అమరావతి పనులు: మంత్రి లోకేశ్

AP: రైతుల త్యాగ ఫలితమే అమరావతి అని మంత్రి లోకేశ్ చెప్పారు. గత ప్రభుత్వం దీన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నినాదంతో 1,631 రోజులపాటు రైతులు ఉద్యమం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు.


