News December 29, 2024
భారీగా తగ్గిన ధరలు.. కేజీ రూ.5
AP: పలు ప్రాంతాల్లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు హోల్ సేల్ వ్యాపారులకు కేజీ రూ.5కే విక్రయిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు KG రూ.8కి కొనాలన్న మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, బహిరంగ మార్కెట్లో టమాటా కేజీ రూ.10-15 వరకు పలుకుతోంది. పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు వాపోతుంటే, కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 1, 2025
2025 సాఫీగా సాగేందుకు ఈ మూడూ కీలకం
కొత్త ఏడాది వచ్చేసింది. గడచిన కాలం ఎన్నోకొన్ని పాఠాలను మనకు నేర్పింది. వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగితే కొత్త ఏడాది సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా సారీ, థాంక్స్, ప్లీజ్ అనే మూడు పదాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని వ్యక్తిత్వ నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా అడిగే సమయంలో ఒక ప్లీజ్, తప్పు జరిగినప్పుడు ఒక సారీ, సాయం పొందినప్పుడు ఒక థాంక్స్.. ఈ మూడూ మనిషి గౌరవాన్ని పెంచుతాయని వారు చెబుతున్నారు.
News January 1, 2025
ట్రావిస్ హెడ్ మొత్తం భారతీయుల్ని అవమానించాడు: సిద్ధూ
పంత్ వికెట్ తీసిన తర్వాత సెలబ్రేషన్స్తో హెడ్ భారతీయులందర్నీ అవమానించారని భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు, చిన్నారులు మ్యాచ్ చూస్తుంటారన్న సోయి లేకుండా హెడ్ అసహ్యకరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. కాగా.. వేలికి గాయం కావడంతో ఐస్క్యూబ్స్లో హెడ్ వేలు పెట్టారని, దాన్ని సెలబ్రేషన్స్ అప్పుడు చూపించారని ఆసీస్ కెప్టెన్ కమిన్స్ వివరణ ఇచ్చారు.
News January 1, 2025
గ్రాఫిక్ డిజైనర్.. బతుకుతెరువుకు ఇప్పుడు ఆటోడ్రైవర్!
ముంబైకి చెందిన కమలేశ్ కాంతేకర్కు గ్రాఫిక్ డిజైనింగ్ ఫీల్డ్లో 14 ఏళ్ల అనుభవం ఉంది. అసిస్టెంట్ క్రియేటివ్ మేనేజర్ స్థాయికి వెళ్లిన అతడికి ఆ తర్వాత ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది. ప్రయత్నాలు చేసీ చేసీ విసిగిపోయి చివరికి ఓ ఆటోను కొనుక్కున్నాడు. ఎవరి దగ్గరో పనిచేయడం కంటే ఇలా కష్టపడితే ఆత్మగౌరవంతో డబ్బు రెండూ ఉంటాయని, తనను అందరూ దీవించాలని కోరుతూ లింకిడ్ఇన్లో పోస్ట్ పెట్టగా అది వైరల్ అవుతోంది.