News January 23, 2025
భారీగా పెరిగిన ధరలు.. కేజీ రూ.450
AP: నాన్వెజ్ వంటలు ఘాటుగా ఉండాలంటే వెల్లుల్లి ఉండాల్సిందే. అయితే ధర మాత్రం అందుబాటులో లేదు. తాడేపల్లిగూడెం మార్కెట్లో KG ధర ₹450కి చేరింది. పదేళ్ల తర్వాత ఈ స్థాయిలో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ ఇందోర్, పిప్లే, ఉజ్జయిని, దలోదా ప్రాంతాల్లో సాగు తగ్గడమే ధర పెరగడానికి కారణమంటున్నారు. గూడెం నుంచే గోదావరి, విశాఖ, VZM, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలకు వెల్లుల్లి ఎగుమతి అవుతుంటుంది.
Similar News
News January 23, 2025
భార్యను ముక్కలుగా నరికిన భర్త.. కారణం ఇదే!
TG: జిల్లెలగూడలో మాధవి <<15230164>>హత్య కేసులో<<>> పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన మాధవి సంక్రాంతికి పుట్టింటికి వెళ్తానని అడగ్గా భర్త గురుమూర్తితో గొడవ జరిగిందని చెప్పారు. ఆ కారణంతోనే భార్యను చంపినట్లు భావిస్తున్నారు. డెడ్ బాడీని ముక్కలుగా నరికి, కుక్కర్లో ఉడికించి చెరువులో పడేసినట్లు గురుమూర్తి పోలీసుల విచారణలో వెల్లడించాడు. గురుమూర్తికి వేరే మహిళతో సంబంధం ఉందని కూడా అనుమానిస్తున్నారు.
News January 23, 2025
త్వరలోనే రాష్ట్రానికి కాగ్నిజెంట్: లోకేశ్
AP: ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే శుభవార్త రాబోతుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దావోస్లో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో ఆయన సమావేశమయ్యారు. ‘రాష్ట్రంలోని వైజాగ్, విజయవాడ, తిరుపతిలో భారీగా కోవర్కింగ్ స్పేస్ ఉంది. కాగ్నిజెంట్ విస్తరణలో భాగంగా ఇక్కడ కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరాం. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆ సంస్థ సీఈఓ తెలిపారు’ అని పేర్కొన్నారు.
News January 23, 2025
ఓలా, ఉబర్ సంస్థలకు కేంద్రం నోటీసులు
క్యాబ్ బుక్ చేసుకునేవారికి మొబైల్ ఫోన్ల ఆధారంగా ఛార్జ్ వేస్తున్నారనే <<15225725>>ఫిర్యాదులపై<<>> కేంద్రం చర్యలకు దిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఓలా, ఉబర్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఒకే రకమైన సేవకు వేర్వేరు ఛార్జీలు వసూలు చేయడంపై స్పందించాలని కోరింది. ఐఫోన్లో రైడ్ బుక్ చేస్తే ఒకలా, ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేస్తే ఇంకొకలా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.