News August 19, 2025
దీపావళికి కార్లు, బైక్‌ల ధరల తగ్గింపు?

దీపావళికి కొత్త కార్లు, బైక్‌లు కొనే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. కొత్త తరం GST సంస్కరణలను అమలు చేయాలని సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 4 స్లాబ్‌లను రెండుకు తగ్గించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని ప్రకారం 28 శాతం పన్ను స్లాబ్‌లో ఉన్న కార్లు, బైక్‌లు 18 శాతం పన్ను స్లాబ్‌లోకి వస్తాయని సమాచారం. తక్కువ ధరలు ఉన్న వాహనాల సేల్స్ పెరగొచ్చని అంచనా.
Similar News
News August 19, 2025
సినిమా సెట్‌లో ఫుడ్ పాయిజన్.. 120 మందికి అస్వస్థత

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న ‘ధురంధర్’ మూవీ సెట్లో ఫుడ్ పాయిజన్ జరిగి 120మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ మూవీ షూట్ లద్దాక్‌లోని లేహ్ జిల్లాలో జరుగుతోంది. ఈ సందర్భంగా 600 మంది సిబ్బంది డిన్నర్ చేశారు. తిన్న వెంటనే కొందరు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు. వెంటనే వారందరినీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఫుడ్ శాంపిళ్లను అధికారులు సేకరించి పరీక్షలకు పంపారు.
News August 19, 2025
త్వరలో పుతిన్, ట్రంప్, జెలెన్‌స్కీ భేటీ

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధాన్ని ముగించేందుకు త్వరలోనే వైట్ హౌస్ వేదికగా డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, జెలెన్‌స్కీ భేటీ కానున్నారు. ట్రంప్-జెలెన్‌స్కీ భేటీలో ఈ అంశం చర్చకు వచ్చింది. వివాదాలు ముగించేందుకు తాము రష్యా, ఉక్రెయిన్ సహా ఏ దేశంతోనైనా కలిసి పని చేసేందుకు సిద్ధమని ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడతానని తెలిపారు.
News August 19, 2025
EP-41: ఇలా చేస్తేనే మీపై గౌరవం: చాణక్య నీతి

సమాజంలో గౌరవం పొందాలంటే మంచి ప్రవర్తన, నడవడిక ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ‘ప్రతి విషయాన్ని తెలుసుకుని, జాగ్రత్తగా మాట్లాడాలి. ఎప్పుడూ వినయంగా, మర్యాదగా ప్రవర్తిస్తే అవమానానికి గురికారు. ఇతరులతో శత్రుత్వం పెంచుకోకూడదు. ఎల్లప్పుడూ ఇతరులను గౌరవించాలి. ఇలా చేయకపోతే మిమ్మల్ని ఎవరూ గౌరవించరు. ఆహ్వానం లేని ఇంటికి అస్సలు వెళ్లకూడదు. వెళ్తే అవమానం, ఎగతాళికి గురవుతారు’ అని పేర్కొంటోంది. #<<-se>>#chanakyaneeti<<>>