News July 25, 2024
రూ.100కు తగ్గేదేలే.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు

మార్కెట్కు వెళ్లిన సామాన్యుల జేబులకు చిల్లు పడుతోంది. ఏ కూరగాయ అయినా రూ.వందకు తగ్గేదేలే అంటోంది. కేజీ టమాటా రూ.100కు చేరగా, చిక్కుడుకాయ రూ.120, పచ్చిమిర్చి రూ.100, క్యారట్ రూ.100, కాకరకాయ రూ.90, క్యాలీఫ్లవర్ రూ.80 పలుకుతున్నాయి. రెండేళ్లుగా ప్రతికూల వాతావరణం, పంట నష్టాలే వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేశాయని ఇటీవలి బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం తెలిపింది. కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది.
Similar News
News December 1, 2025
సంగారెడ్డి: నేషనల్ హైవే పురోగతిపై కలెక్టర్ సమీక్ష

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేషనల్ హైవే 65 పనుల పురోగతిపై కలెక్టర్ ప్రావీణ్య సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. హైవే పనుల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
News December 1, 2025
కాంగ్రెస్కు శశిథరూర్ దూరం అవుతున్నారా?

కాంగ్రెస్కు ఆ పార్టీ MP శశిథరూర్కు మధ్య విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. ఇటీవల SIRపై పార్టీ నిర్వహించిన భేటీకి ఆయన గైర్హాజరయ్యారు. అనారోగ్యం వల్లే వెళ్లలేదని చెప్పారు. కానీ తర్వాతి రోజే PM పాల్గొన్న ఓ ప్రోగ్రామ్కు వెళ్లారు. తాజాగా పార్లమెంట్ సెషన్స్ ముందు జరిగిన పార్టీ మీటింగ్కూ హాజరుకాలేదు. ట్రావెలింగ్లో ఉన్నందునే తాను రాలేదని ఆయన చెబుతున్నప్పటికీ INCకి దూరమవుతున్నారనే చర్చ జరుగుతోంది.
News December 1, 2025
సంస్కరణల ప్రభావం.. నవంబర్లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు

జీఎస్టీ సంస్కరణల ప్రభావం నవంబర్ వసూళ్లపై పడింది. అక్టోబర్లో రూ.1.96 లక్షల కోట్లు వసూళ్లవ్వగా నవంబర్లో రూ.1.70 లక్షల కోట్లకే పరిమితమైంది. 2024 నవంబర్లో రూ.34,141 కోట్లుగా ఉన్న CGST వసూళ్లు ఈ ఏడాది రూ.34,843 కోట్లకు పెరిగాయి. అయితే, SGST వసూళ్లు మాత్రం రూ.43,047 కోట్ల నుంచి రూ.42,522 కోట్లకు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.50,093 కోట్ల నుంచి రూ.46,934 కోట్లకు పడిపోయాయి.


