News May 10, 2024
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది: ABD

హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించారు. రోహిత్, బుమ్రా వంటి సీనియర్లున్న చోట అలాంటి ధోరణి పనికిరాదని హితవు పలికారు. ‘తన కెప్టెన్సీ అలాగే ఉండాలని, ధోనీ మాదిరి చేద్దామని పాండ్య ప్రయత్నిస్తున్నాడు. యువకులు అధికంగా ఉన్న GT టీమ్‌లో ఆ శైలి పనిచేస్తుంది. అత్యంత అనుభవజ్ఞులున్న MIలో అందరూ దాన్ని అంగీకరించరు’ అని ఏబీడీ సూచించారు.
Similar News
News March 17, 2026
Stock Market: వరుసగా రెండో రోజూ లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో క్లోజ్ అయ్యాయి. గ్యాస్, చమురు ట్యాంకర్లు భారత్‌కు చేరుతుండడం సెంటిమెంట్‌ను పెంచింది. కీలక రంగాల షేర్లు అట్రాక్టివ్ ప్రైస్‌కు తగ్గడంతో కొనుగోళ్ల కళ కనిపించింది. సెన్సెక్స్ 567 పాయింట్లు పెరిగి 76,070 వద్ద క్లోజైంది. నిఫ్టీ 172 పాయింట్లు ఎగబాకి 23,581 వద్ద స్థిరపడింది. ఎటర్నల్, టాటా స్టీల్, M&M, BEL షేర్లు లాభపడగా.. ఇన్ఫీ, ITC, TCS నష్టపోయాయి.
News March 17, 2026
‘ఉడుతా భక్తి’ అంటే ఏమిటి?

ఎలాంటి స్వార్థం లేకుండా తమ శక్తి మేరకు చేసే చిన్న సహాయం గురించి చెప్పే సందర్భంలో ‘ఉడుతా భక్తి’ జాతీయాన్ని వాడతారు. ఇది రామాయణం నుంచి పుట్టింది. లంకకు రామసేతు నిర్మాణంలో తాను కూడా భాగం కావాలని ఉడుత భావిస్తుంది. నీటిలో తడుస్తూ ఇసుకలో పొర్లాడుతూ ఆ ఇసుకను రాళ్ల మధ్య నింపే ప్రయత్నం చేస్తుంది. అందుకు రాముడు మెచ్చుకొని ఉడుత మీద నిమరడంతో ఏర్పడిన గీతలే ఇప్పటికీ ఉన్నాయని ఓ నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 17, 2026
వంటింటి చిట్కాలు

* నిమ్మజాతి పండ్లు, టమాటాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
* వంటింట్లో వాడే స్పాంజీలూ, మసి బట్టల్ని ఉప్పు వేసిన చల్లని నీళ్లలో కాసేపు నానబెట్టి తరువాత ఉతకండి. క్రిములు పోతాయి. దుర్వాసన కూడా ఉండదు.
* పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే పాత్రలు నీచు వాసన రావు.
* తేనె ముద్దగా అయితే, కాసేపు అది ఉన్న సీసాను వేడి నీళ్లలో ఉంచితే సరిపోతుంది.


