News March 17, 2024
సభపై ప్రధాని మోదీ, చంద్రబాబు నవ్వులు

చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పక్కపక్కనే కూర్చున్నారు. తొలుత పవన్ కళ్యాణ్ ప్రసంగించగా.. ఆ సమయంలో మోదీ, చంద్రబాబు ముచ్చటించారు. వారిరువురి మధ్య నవ్వులు విరియడంతో సభకు వచ్చిన వారిలో జోష్ కనిపించింది.
Similar News
News December 9, 2025
GNT: నేడు డ్రగ్ స్టోర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు ప్రారంభం

మంత్రి సత్య కుమార్ యాదవ్ మంగళవారం రాష్ట్రంలోని డ్రగ్ స్టోర్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. మంగళగిరి ఏపీఐఐసీ 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాలను ఉదయం 10.30 గంటలకు మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ప్రభుత్వం అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు చేస్తుందని అన్నారు.
News December 9, 2025
స్క్రబ్ టైఫస్ మరణాలు సంభవించకుండా చూడాలి: కలెక్టర్

జిల్లాలో స్క్రబ్ టైఫస్ మరణాలు సంభవించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్లో కలెక్టర్ స్క్రబ్ టైఫస్ నివారణ, ముందస్తు జాగ్రత్త చర్యలు, హౌసింగ్, ఉపాధి హామీ పనులు, గ్రామ వార్డు సచివాలయాల సేవలతో సహా పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షా కాలంలో చిగ్గర్ మైట్ కుట్టడం వల్ల ఈ జ్వరాలు వస్తాయని తెలిపారు.