News April 25, 2024

వారసత్వ పన్ను వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రధాని మోదీ

image

మరణించిన వ్యక్తుల ఆస్తుల్ని కూడా కాంగ్రెస్ దోచుకుంటుందని PM మోదీ విమర్శించారు. వారసత్వ పన్ను గురించి కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన <<13113751>>వ్యాఖ్యలపై<<>> మండిపడ్డారు. ‘తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన సంపదపై పన్ను విధించాలని కాంగ్రెస్ అంటోంది. అలా చేస్తే ప్రజలు కష్టపడి సంపాదించిందంతా వారి పిల్లలకు దక్కదు’ అని ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.

Similar News

News March 28, 2026

మీది ప్రేమేనా? ఓసారి చెక్ చేసుకోండి!

image

మనం ఒకరిని ఇష్టపడేటప్పుడు అది ప్రేమా లేక ‘లిమరెన్స్’ అనే భ్రమలో ఉన్నామా? అని గుర్తించడం ముఖ్యం. లిమరెన్స్‌ అనేది ఓ రకమైన ‘ఎమోషనల్ అడిక్షన్’. ఈ స్థితిలో ఉన్నవారు అవతలి వ్యక్తి గురించి అతిగా ఊహించుకోవడం, వారి కోసం పరితపించడం చేస్తారు. వారిని కోల్పోతామేమో అనే అభద్రతాభావం మానసికంగా వేధిస్తుంది. నిజమైన ప్రేమలో నమ్మకం, గౌరవం ఉంటుంది. కానీ లిమరెన్స్ మిమ్మల్ని ఆ వ్యక్తిపై పిచ్చిగా ఆధారపడేలా చేస్తుంది.

News March 28, 2026

అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ వాయిదా

image

అఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెనిన్’ చిత్రం విడుదల పోస్ట్‌పోన్ అయింది. మే 1వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా జూన్ 26న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హీరోయిన్‌గా భాగ్యశ్రీబోర్సే నటించగా తమన్ మ్యూజిక్ అందించారు.

News March 28, 2026

రాజధానికి పార్లమెంట్ ఆమోదం తర్వాత రాష్ట్రంలో వేడుకలు: CM CBN

image

AP: రాజధాని అమరావతికి పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి నాది అనే భావనను ప్రజల్లో నింపేలా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. రాజధాని చట్ట సవరణకు కేంద్ర క్యాబినెట్ ఏప్రిల్ 1న ఆమోదం తెలిపే అవకాశం ఉందని మీడియా చిట్‌చాట్‌లో వెల్లడించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదం వచ్చేలా కేంద్రానికి తీర్మానం పంపినట్లు పేర్కొన్నారు.