News October 2, 2024

రజినీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా!

image

ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. లతా రజినీకాంత్‌కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. ‘శస్త్రచికిత్స జరిగిందని, క్షేమంగా ఉన్నారని చెప్పారు. తలైవా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు’ అని పేర్కొన్నారు.

Similar News

News October 2, 2024

మెడికల్ పీజీలో సర్వీస్ కోటా పెంపు

image

AP: మెడికల్ పీజీ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటా రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 15% నుంచి 20శాతానికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో 15శాతానికే పరిమితం చేయడంతో PHC వైద్యులు ఆందోళనకు దిగారు. వారితో చర్చల అనంతరం ప్రభుత్వం ఇన్‌సర్వీస్ రిజర్వేషన్‌ను క్లినికల్ విభాగంలో 20శాతానికి పెంచగా, నాన్-క్లినికల్ సీట్లలో రిజర్వేషన్ మాత్రం 30శాతానికి పరిమితం చేశారు. ఈ ఏడాది నుంచే ఇది అమల్లోకి రానుంది.

News October 2, 2024

పండుగకు ఊరెళ్తున్నారా? జాగ్రత్త

image

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు జాగ్రత్త. ఇంట్లో బంగారం, డబ్బులు ఉంచవద్దు. బ్యాంకు లాకర్లలో పెట్టండి. లేదంటే వెంట తీసుకెళ్లండి. ఇంటిని గమనించాలని పక్కింటి వారికి చెప్పాలి. కాలనీల్లో, వీధుల్లో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు, డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఇలా చేస్తేనే చోరీలను నియంత్రించవచ్చని పోలీసులు చెబుతున్నారు.

News October 2, 2024

పేపర్ కొనుగోలుకు వాలంటీర్లకిచ్చే నగదు నిలిపివేత

image

AP: న్యూస్ పేపర్ కొనుగోలు చేసేందుకు వాలంటీర్లకు చెల్లిస్తున్న రూ.200 నగదును ప్రభుత్వం నిలిపివేసింది. ఇటీవల పేపర్‌ కొనుగోలుకు నగదు సాయం నిలిపివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా దినపత్రిక కొనుగోలు కోసం గత ప్రభుత్వం 2022 జూన్ 29న జీవో జారీ చేసింది. సాక్షి పేపర్ కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారని TDP ఆరోపించింది.