News September 13, 2025
సుశీలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన <<17691512>>సుశీల<<>> కర్కీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్‌లో సోదర, సోదరీమణుల శాంతి, అభ్యున్నతికి భారత్ కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా అక్కడ Gen-G యువత ఇటీవల హింసాత్మక ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేసి నిరసనకారుల ప్రతిపాదన మేరకు సుశీలను ప్రధానిగా నియమించారు.
Similar News
News February 8, 2026
‘విషం’ తాగుతున్నాం.. FSSAI ఏం చేస్తోంది?

పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ పాలు, పాల పదార్థాలు వినియోగిస్తారు. అయితే డిటర్జెంట్, యూరియాతో <<19076004>>పాలను<<>> తయారు చేయడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న గుజరాత్‌లో 300 లీటర్ల పాలతో 1,800 లీ. పాలు తయారుచేస్తున్నారని తేలడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉందని, FSSAI ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. తరచూ తనిఖీలు చేసి, కల్తీరాయుళ్లపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
News February 8, 2026
మున్సి‘పోల్స్’: వలస ఓటర్లకు ఫ్లైట్ టికెట్లు.. ముంబై వెళ్లి ప్రచారం

TG: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వినూత్న మార్గాలు ఎంచుకుంటున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగోజిగూడ, తాళ్లసింగారం, లింగారెడ్డి గూడెం, తంగడపల్లి గ్రామాలకు చెందిన సుమారు 200 మంది ఓటర్లు ఉపాధి కోసం ముంబైకి వెళ్లారు. వారిని రప్పించేందుకు విమానం, రైలు, బస్సు ఖర్చులు భరిస్తామని హామీలు ఇస్తున్నారు. కొందరు అభ్యర్థులు స్వయంగా ముంబైకి వెళ్లి ప్రచారం కూడా చేశారు.
News February 8, 2026
నింగిలో నిఘా: శత్రు ఉపగ్రహాలపై భారత్ సరికొత్త ‘స్నూపింగ్’!

అహ్మదాబాద్‌కు చెందిన ‘అజిస్తా’ సంస్థ కక్ష్యలో ఉన్న ఇతర ఉపగ్రహాలను ఫొటోలు తీసే (In-orbit imaging) సామర్థ్యాన్ని నిరూపించింది. ఇండియన్ టెక్నాలజీతో తయారైన AFR శాటిలైట్.. వేగంగా కదులుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని స్పష్టంగా ఫొటోల్లో బంధించింది. శత్రువుల కదలికలను పసిగట్టడానికి, అంతరిక్ష ఆస్తులను రక్షించుకోవడానికి, క్షిపణులను ట్రాక్ చేయడానికి ఈ ‘స్పేస్ స్నూపింగ్’ భారత్‌కు కీలకం కానుంది.


