News July 11, 2024

ప్రధాని మోదీకి 15 దేశాల అత్యున్నత పురస్కారాలు

image

ప్రధాని మోదీని ఇప్పటివరకు 15 దేశాలు అక్కడి అత్యున్నత పురస్కారంతో సత్కరించాయి. ఇటీవల రష్యా ప్రెసిడెంట్ ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డు’ను PMకి అందించారు. ఈ జాబితాలో గ్రీస్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్, ఫ్రాన్స్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ లెజియన్, ఈజిప్టు ఆర్డర్ ఆఫ్ ది నైల్, US గవర్నమెంట్స్ లెజియన్ ఆఫ్ మెరిట్, UAE ఆర్డర్ ఆఫ్ జయేద్, సౌదీఅరేబియాస్ ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజిజ్ అవార్డులున్నాయి.

Similar News

News November 21, 2025

వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

image

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.

News November 21, 2025

పరమ పావన మాసం ‘మార్గశిరం’

image

మార్గశిర మాసం విష్ణువుకు అతి ప్రీతికరమైనది. ఈ మాసంలోనే దత్తాత్రేయుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు వంటి దైవ స్వరూపులు అవతరించారు. పరాశరుడు, రమణ మహర్షి వంటి మహనీయులు జన్మించారు. భగవద్గీత లోకానికి అందిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ధనుర్మాసం ప్రారంభం, హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందుకే ఈ మాసం ఎంతో విశేషమైందని పండితులు చెబుతారు.

News November 21, 2025

ESIC ముంబైలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

image

<>ESIC<<>> ముంబై 54 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి 5 వరకు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి MBBS/MD/MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.300, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: www.esic.gov.in