News February 12, 2025

అమెరికాకు పయనమైన ప్రధాని మోదీ

image

ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరారు. యూఎస్‌లో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ట్రంప్ ఆ దేశాధ్యక్షుడయ్యాక మోదీకి ఇదే తొలి పర్యటన. ఈ సందర్భంగా అక్కడి వ్యాపారవేత్తలు, భారత ప్రవాసుల్ని ఆయన కలవనున్నారు. ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో ఇరు దేశాల బంధం మరింత బలోపేతం చేసుకునే దిశగా మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

Similar News

News November 23, 2025

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్‌లో ఉద్యోగాలు

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్‌ 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ (ఫిజిక్స్, మ్యాథ్స్, జియోఫిజిక్స్,జియాలజీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్), ఎంఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు DEC 10 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://iigm.res.in/

News November 23, 2025

పొంచి ఉన్న తుఫాను ముప్పు.. రైతుల ఆందోళన

image

AP: దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే సూచనలు కనిపిస్తుండటంతో రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా, భారీ వర్షాలు పడితే పంట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మిర్చి తోటలు, రబీ పంటలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. వెంటనే ధాన్యాన్ని కుప్పలు వేసి, టార్పాలిన్లతో కప్పి భద్రపరచాలని అధికారులు సూచించారు.

News November 23, 2025

పత్తి రైతులకు తప్పని యాప్ కష్టాలు

image

పండించిన పంటను అమ్ముకోవడానికి ఇన్ని యాప్‌లలో నమోదుకు చేసుకోవాలా? అని కొందరు పత్తి రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంట వేశాక ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలి. లేకుంటే పంట కొనరు. పంట చేతికొచ్చాక అమ్మడానికి రైతుసేవా కేంద్రంలో సీఎం యాప్‌లో నమోదు చేసుకోవాలి. తర్వాత CCIకి చెందిన కపాస్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఈ మూడూ అనుసంధానమైతేనే పత్తిని రైతులు అమ్ముకోగలరు. ఈ విధానం రైతులకు ఇబ్బందిగా మారింది.