News September 6, 2025
రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆయన ఈ నెల 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక, ఇతర అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు కాసేపట్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
Similar News
News September 7, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ అనకాపల్లి, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే.
News September 6, 2025
దేశవ్యాప్తంగా SIR అమలుకు ఈసీ సన్నాహాలు!

దేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అమలు చేయడంపై ఈ నెల 10న ఎలక్షన్ కమిషన్(EC) కీలక భేటీ నిర్వహించనుంది. 2026లో బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో త్వరగా SIR కింద ఓట్ల వడపోత చేపట్టాలని భావిస్తోంది. అయితే బిహార్‌లో SIR అమలును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. దానిపై రాహుల్ ఏకంగా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
News September 6, 2025
కిస్ క్యామ్‌లో దొరికిన HR.. భర్తతో విడాకులు!

కోల్డ్ ప్లే కన్సర్ట్‌లో ఆస్ట్రోనోమర్ CEO ఆండీ బైరోన్‌తో కిస్ <<17113447>>క్యామ్‌లో<<>> దొరికిన HR క్రిస్టిన్ తన భర్త ఆండ్రూ నుంచి విడిపోతున్నారు. AUG 13న ఆమె న్యూ హాంప్‌షైర్‌లోని పోర్ట్స్‌మౌత్ కోర్టులో విడాకులకు అప్లై చేశారు. తాజాగా ఈ విషయం బయటికొచ్చింది. కిస్ క్యామ్ వీడియో వైరల్ కాగా సదరు కంపెనీ బైరోన్, క్రిస్టిన్‌ను తొలగించింది. ఇక అప్పటి నుంచే ఆండ్రూ-క్రిస్టినా వేర్వేరుగా ఉంటున్నట్లు సమాచారం.