News September 23, 2024

పాలస్తీనా అధ్యక్షుడిని కలిసిన ప్రధాని మోదీ

image

న్యూయార్క్‌లో జరుగుతున్న సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్ సందర్భంగా పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. గాజాలో మానవతా సంక్షోభం, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలకు భారత్ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. పాలస్తీనాను గుర్తించిన మొదటి దేశాల్లో భారత్ ఒకటని గుర్తుచేసిన మోదీ, UNలో ఆ దేశ సభ్యత్వానికి మద్దతు తెలియజేశారు.

Similar News

News September 23, 2024

మార్చి 28న ‘హరి హర వీరమల్లు’ రిలీజ్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి & జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈరోజు ఉదయం 7 గంటలకు విజయవాడలో కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలైందని, పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతారని తెలిపారు. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

News September 23, 2024

మద్యం ధరలు తగ్గించి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు?: VSR

image

AP: కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ‘మెడిసిన్స్ లేదా విద్యా సంస్థల ఫీజులను తగ్గించకుండా, మద్యం ధరను(₹99/180ml) తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మద్యపానాన్ని, గృహ హింసను పెంచుతుంది. ప్రజారోగ్యాన్ని మరింత దిగజారుస్తుంది. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలపై సందేహం కలుగుతోంది’ అని ట్వీట్ చేశారు.

News September 23, 2024

ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ యోధుల విగ్రహాలు పెట్టండి: కూనంనేని

image

తెలంగాణ సాయుధ పోరాట యోధుల విగ్రహాలను HYD ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాలని సీపీఐ MLA కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దొడ్డి కొమురయ్య విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై, బొమ్మగాని ధర్మభిక్షం, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, భీమరెడ్డి నర్సింహారెడ్డి, నల్లమల్ల గిరిప్రసాద్ విగ్రహాలను వారి జిల్లా కేంద్రాల్లో ప్రతిష్ఠించి గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.