News August 26, 2024
బైడెన్‌కు ప్రధాని మోదీ ఫోన్

అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కాసేపటి క్రితం ఫోన్ సంభాషణ జరిగింది. ఇటీవల నెలరోజుల వ్యవధిలో యుద్ధంలో తలపడుతున్న రష్యా, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు వెళ్లి వచ్చిన మోదీ ఆ వివరాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. బైడెన్ పదవీ కాలం కొన్ని నెలల్లో ముగుస్తుండడంతో మోదీ ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు వార్తలొస్తున్నాయి.
Similar News
News November 24, 2025
రేపు GHMC పాలకమండలి సమావేశం!

GHMC 12వ సాధారణ సమావేశాన్ని రేపు ప్రధాన కార్యాలయంలో నిర్వహించనుంది. ఐదేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. ప్రస్తుత పాలక మండలికి జనవరిలో చివరి సమావేశం ఉంటుందని GHMC వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 150 మంది కార్పొరేటర్లలో GHMCలో 146 మంది ఉన్నారు. BRS–40, MIM–41, INC–24, BJP–41 మంది సభ్యులు ఉన్నారు. ఇద్దరు మరణించడం, ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో 4 స్థానాలు ఖాళీగానే ఉన్నాయి.
News November 24, 2025
ఈ డిగ్రీ ఉంటే జాబ్ గ్యారంటీ!

కంప్యూటర్ సైన్స్ డిగ్రీ హోల్డర్లకే వచ్చే ఏడాది ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉన్నట్లు ఇండియా స్కిల్స్ రిపోర్టు-2026 వెల్లడించింది. వారిలో ఎంప్లాయిబిలిటీ రేటు 80%గా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో IT(78%), B.E/B.Tech(70%), MBA(72.76%), కామర్స్(62.81%), నాన్ IT సైన్స్(61%), ఆర్ట్స్(55.55%), ITI-ఒకేషనల్(45.95%), పాలిటెక్నిక్(32.92%) ఉన్నట్లు అంచనా వేసింది. డిగ్రీతోపాటు స్కిల్స్ ముఖ్యమని పేర్కొంది.
News November 24, 2025
కాపర్ టి-రకాలు

అవాంఛిత గర్భధారణను నివారించడానికి డాక్టర్లు కాపర్ టిని సూచిస్తారు. దీంట్లో రెండు రకాలున్నాయి. ఒకటి హార్మోనల్, మరొకటి నాన్ హార్మోనల్. హార్మోన్ కాపర్-టిలో లెవోనార్జెస్ట్రెల్ అనే హార్మోన్ విడుదలై శుక్రకణాలు అండం వద్దకు చేరకుండా ఆపుతుంది. నాన్ హార్మోనల్ కాపర్ టి రాగి అయాన్లను విడుదల చేస్తుంది. ఇవి శుక్రకణాలను, అండాలను నాశనం చేస్తాయి. వైద్యుల సలహాతో మీకు ఏది సరిపోతుందో తెలుసుకొని వాడటం మంచిది.


