News March 17, 2024
గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ

AP: ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన నిర్వహిస్తోన్న ప్రజాగళం బహిరంగసభకు కాసేపట్లో హాజరుకానున్నారు. పదేళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనిపించనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Similar News
News November 19, 2025
లక్కీ డిప్‌కు ఎంతమంది సెలెక్ట్ అవుతారు?

తిరుమల శ్రీవారి విశేష సేవల కోసం ప్రతి నెలా దాదాపు 4-5 లక్షల మంది భక్తులు లక్కీ డిప్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో కేవలం 7,500 నుంచి 8,500 మందికి మాత్రమే సేవల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీరు శ్రీవారిని తొలి గడప నుంచి అతి దగ్గరగా దర్శించుకునే అదృష్టాన్ని పొందుతారు. లక్కీ డిప్లో ఎంపిక కానివారు, శ్రీవాణి ట్రస్ట్‌కు ₹10 వేలు విరాళం ఇచ్చి కూడా మొదటి గడప దర్శనం ద్వారా శ్రీవారిని వీక్షించవచ్చు.
News November 19, 2025
BOBలో 82 పోస్టులకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడా(<
News November 19, 2025
మల్లె కొమ్మ కత్తిరింపులు.. ఈ జాగ్రత్తలతో మేలు

మంచి దిగుబడికి మల్లె తోటల పెంపకంలో మొదటి కత్తిరింపు పంట నాటిన ఏడాదికి చేయాలి. ఏటా నవంబర్-డిసెంబర్లో పొదను కత్తిరించాలి. కొమ్మలను కత్తిరించడానికి 10 -15 రోజుల ముందు నుంచి నీరు కట్టడం ఆపేయాలి. నవంబర్ చివరి నుంచి జనవరి తొలివారం వరకు కత్తిరింపులు చేస్తే మార్చి నుంచి జులై వరకు పూలు వస్తాయి. ఇలా చేయడం వల్ల మల్లె మొక్కలన్నీ ఒకేసారి పూతకురావు. రైతు ఎక్కువ రోజులు మల్లెను మార్కెటింగ్ చేసి లాభం పొందవచ్చు.


