News August 24, 2024

ఢిల్లీకి తిరిగొచ్చిన ప్రధాని మోదీ

image

ప్రధాని నరేంద్రమోదీ రెండు దేశాల పర్యటన ముగిసింది. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆయన పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లారు. మొదట పోలాండ్‌కు వెళ్లిన మోదీ 45 ఏళ్లలో అక్కడ పర్యటించిన భారత తొలి ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత రైలులో ఉక్రెయిన్‌కు వెళ్లి జెలెన్ స్కీని ఓదార్చారు. బాలల స్మారకాన్ని సందర్శించారు. మానవతా సాయం కింద వైద్య పరికరాలు అందించారు.

Similar News

News December 10, 2025

ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ

image

భారత పర్యటనలో మెస్సీ పలు ప్రాంతాలను చుట్టేయనున్నారు. ఈ నెల 13న కోల్‌కతాలో అడుగుపెట్టనున్న ఆయన సాయంత్రం HYD వస్తారు. 14న ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేస్తారు. 15వ తేదీ ఢిల్లీ చేరుకొని PM మోదీతో భేటీ అవుతారు. కాగా తొలిరోజు కోల్‌కతాలో తన అతిపెద్ద(70 అడుగుల) విగ్రహాన్ని మెస్సీ ఆవిష్కరించాల్సి ఉన్నా సెక్యూరిటీ కారణాలతో ఆ ప్రోగ్రామ్‌ను వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు.

News December 10, 2025

దిగుబడి పెంచే నానో ఎరువులను ఎలా వాడాలి?

image

దశాబ్దాలుగా సాగులో ఘన రూపంలో యూరియా, DAPలను రైతులు వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూప నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటి వాడకం వల్ల ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90% గ్రహించి, దిగుబడి పెరిగి.. పెట్టుబడి, గాలి, నేల కాలుష్యం తగ్గుతుందంటున్నారు నిపుణులు. నానో ఎరువులను ఎలా, ఎప్పుడు, ఏ పంటలకు వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 10, 2025

వణికిస్తున్న చలి.. మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు

image

TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రాబోయే 3-4 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 °C తక్కువగా నమోదవుతాయని HYD IMD తెలిపింది. ఇవాళ, రేపు ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, NML, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న కనిష్ఠ ఉష్ణోగ్రత అత్యల్పంగా ఆసిఫాబాద్(D) గిన్నెధరిలో 6.1°C నమోదైంది. 20 జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది.