News March 26, 2024
రేఖా పాత్రతో మాట్లాడిన ప్రధాని మోదీ

‘సందేశ్‌ఖాలీ’ బాధితురాలు, బీజేపీ ఎంపీ అభ్యర్థి రేఖా పాత్రతో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘మీరు కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తారు. సందేశ్‌ఖాలీలో మీరెంతో గొప్ప పోరాటం చేశారు. ఎంతో మంది శక్తిమంతులను జైలుకు పంపించారు’ అని ప్రధాని కొనియాడారు. ఆమెను ‘శక్తి స్వరూపిణి’గా మోదీ అభివర్ణించారు. కాగా.. బసిరాత్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రేఖా పోటీ చేయనున్నారు.
Similar News
News March 26, 2026
రాజధాని పేరుతో అమరావతిలో అవినీతి యజ్ఞం: సజ్జల

AP: అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏంటని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అలాగైతే మండలిలోనూ చర్చ పెట్టాలన్నారు. అమరావతిలో CM చంద్రబాబు అవినీతి యజ్ఞం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై జగన్‌కు అభ్యంతరం లేదని, అందుకే CBN కంటే ముందే భూమి కొనుక్కొని ఆఫీస్, ఇల్లు కట్టుకున్నట్లు చెప్పారు. రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిని ఆయన వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
News March 26, 2026
అంతరాయం లేకుండా ఇంధన సరఫరా: కేంద్రం

దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్రం పునరుద్ఘాటించింది. అన్ని రిటైల్ ఔట్‌లెట్లకు సరిపడా సప్లై చేస్తున్నట్లు పేర్కొంది. దేశంలోని ప్రతి సిటిజెన్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంధన సరఫరాకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, అధికారిక ప్రకటనలు మాత్రమే ఫాలో కావాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో 2 నెలలకు సరిపడా ఆయిల్ ఉందని వెల్లడించింది.
News March 26, 2026
రేపే శ్రీరామనవమి.. ముహూర్తం ఇదే

శ్రీరామనవమి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. రేపు చైత్ర శుద్ధ నవమి రోజున ఉ.11.06 నుంచి మ.1.31 వరకు రఘురాముడి పూజకు మంచి సమయమని పండితులు చెబుతున్నారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా ఇదే సమయంలో జరుగుతుందంటున్నారు. మ.ఒంటి గంటలోపు ఇంట్లో స్వామివారికి నివేదన సమర్పించి, ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి భోజనం చేయాలని సూచిస్తున్నారు. ఇక రేపు భద్రాద్రిలో 12pmకు సీతారాముల కళ్యాణం జరగనుంది.


