News March 17, 2024

ఎన్టీఆర్‌ను తలచుకున్న ప్రధాని మోదీ

image

టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ను ప్రజాగళం సభలో ప్రధాని మోదీ తలచుకున్నారు. ‘శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే తెలుగునాట నందమూరి తారకరామారావు గుర్తొస్తారు. పేదల కోసం, రైతుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని, అందించిన సేవల్ని మనం కచ్చితంగా గుర్తుచేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని పదే పదే దెబ్బతీసిన విషయాన్ని మరచిపోకూడదు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News April 4, 2025

సచివాలయంలో అగ్నిప్రమాదం.. సీఎం ఆగ్రహం

image

AP: సచివాలయంలో <<15986572>>అగ్నిప్రమాదం<<>> జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. సెక్రటేరియట్‌లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అని అధికారులను నిలదీశారు. ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు. వెంటనే అన్ని చోట్లా సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయ ప్రాంగణంలో చెత్త పేరుకుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో చెత్తను క్లియర్ చేయాలని ఆదేశించారు.

News April 4, 2025

నా పోటీ సీఎం చంద్రబాబుతోనే: లోకేశ్

image

AP: ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా మంగళగిరికి చెందిన 298 మందికి మంత్రి లోకేశ్ శాశ్వత ఇంటిపట్టాలు పంపిణీ చేశారు. తన పోటీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే అని, కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువొస్తుందని చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్నానని ఆయన చెప్పారు. మంగళగిరిలో రానున్న రోజుల్లో కరెంట్ తీగలు కనిపించవని తెలిపారు. భూగర్భ విద్యుత్, డ్రైనేజ్, గ్యాస్ వ్యవస్థను తీసుకొస్తామని వెల్లడించారు.

News April 4, 2025

శ్రీరామనవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం: పొంగులేటి

image

TG: శ్రీరామనవమి తర్వాత రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రైతుల విషయంలో అధికారులు అలసత్వం వహించొద్దని ఆయన ఆదేశించారు. ధాన్యం తరుగు పెడితే మిల్లర్లపై చర్యలు తప్పవని ఓ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా హెచ్చరించారు. అరకిలో ధాన్యం తరుగు తీసినా కేసులు పెడతామన్నారు. రూ.20,609 కోట్ల రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు.

error: Content is protected !!