News January 22, 2025

ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు ప్రధాని మోదీ!

image

UPలోని ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాకు PM మోదీ FEB 5న వెళ్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల 10న ప్రయాగ్‌రాజ్ చేరుకొని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నట్లు సమాచారం. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు 9 రోజుల్లో 9 కోట్ల మంది మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News October 22, 2025

బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్

image

సీనియర్ సిటిజన్(60 ఏళ్లు పైబడిన) నూతన యూజర్ల కోసం BSNL కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.1,812తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు రోజూ 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMSలు అందించనుంది. దీంతోపాటు BiTV సబ్‌స్క్రిప్షన్ 6 నెలల పాటు ఉచితంగా అందించనుంది. వచ్చే నెల 18 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అటు కొత్త యూజర్లకు రూ.1కే <<18014372>>రీఛార్జ్<<>> ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News October 22, 2025

అక్టోబర్ 22: చరిత్రలో ఈరోజు

image

1901: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం జయంతి
1998: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ మరణం
2001: సినీ నటుడు రామకృష్ణ మరణం
2008: చంద్రుడి పైకి మానవరహిత చంద్రయాన్-1ను ప్రయోగించిన ఇస్రో
➣అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం

News October 22, 2025

గాజాలో చిన్నారికి ‘సింగపూర్’ పేరు.. కారణమిదే

image

కష్ట కాలంలో అన్నం పెట్టిన స్వచ్ఛంద సంస్థ పట్ల పాలస్తీనాకు చెందిన తల్లిదండ్రులు కృతజ్ఞతను చాటుకున్నారు. సింగపూర్‌కు చెందిన ‘లవ్ ఎయిడ్ సింగపూర్’ సంస్థ గాజాలో ఉచితంగా ఆహారం అందజేసింది. ఇందులో వంటమనిషిగా పనిచేసిన స్థానికుడైన హదాద్ ఇటీవల ఓ పాపకు తండ్రి అయ్యాడు. ఈ క్రమంలో తమకు అండగా నిలిచినందుకు బిడ్డకు ‘సింగపూర్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరలవుతోంది.