News June 25, 2024

జులైలో రష్యాకు ప్రధాని మోదీ!

image

ప్రధాని మోదీ వచ్చే నెలలో రష్యాలో పర్యటించనున్నారని తెలుస్తోంది. భారత్-రష్యా మధ్య వార్షిక చర్చల కోసం పుతిన్‌తో మోదీ సమావేశమవుతారని రష్యా మీడియా పేర్కొంది. ముందు నుంచి భారత్‌కు రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన జరగనున్నట్లు సమాచారం. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్ విషయంలోనూ భారత్ స్వతంత్ర వైఖరి అవలంబిస్తోంది.

Similar News

News November 26, 2025

రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం: CM

image

AP: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు న్యాయం జరగాలని, సాంకేతిక ఇబ్బందులు ఉంటే తక్షణం పరిష్కరించాలని CRDA సమీక్షలో సూచించారు. మరోవైపు రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ చేయాలని, నిర్మాణాల నాణ్యత, వేగం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పేర్కొన్నారు.

News November 26, 2025

భట్టి కుమారుడి ఎంగేజ్‌మెంట్.. హాజరైన సీఎం

image

TG: హైదరాబాద్‌లో జరిగిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సతీమణి, కూతురు, అల్లుడితో కలిసి వచ్చిన సీఎం.. కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.

News November 26, 2025

RRR కేసు.. సునీల్ కుమార్‌కు సిట్ నోటీసులు

image

AP: రఘురామ కృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసులో IPS అధికారి, సీఐడీ మాజీ చీఫ్ PV సునీల్‌కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. DEC 4న జరిగే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. 2021లో రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. కస్టడీలో చంపేందుకు ప్రయత్నించారని RRR 2024లో గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సునీల్ కుమార్‌తో పాటు మాజీ సీఎం జగన్, మరికొందరిని నిందితులుగా చేర్చారు.