News March 14, 2025
వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Similar News
News October 26, 2025
మద్యం షాపులకు రేపు లక్కీ డ్రా

TG: మద్యం దుకాణాలకు రేపు ఉదయం 11 గంటలకు లక్కీ డ్రాలు తీయనున్నారు. జిల్లాల వారీగా దరఖాస్తుదారులు, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరగనుంది. మొత్తం 2,620 షాపులకు 95 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వైన్స్కు భారీగా డిమాండ్ నెలకొంది. శంషాబాద్ పరిధిలో అత్యధికంగా 100 దుకాణాలకు 8,536, సరూర్నగర్లో 134 షాపులకు 7,845 దరఖాస్తులు రావడం గమనార్హం.
News October 26, 2025
అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులపై దుమారం

సంక్షోభంలో చిక్కుకున్న అదానీ సంస్థలను కాపాడేందుకు ప్రభుత్వం LICతో ₹33 వేల కోట్ల పెట్టుబడులు పెట్టించిందన్న Washington Post కథనం దుమారం రేపుతోంది. ఇవి తప్పుడు ఆరోపణలని, తాము స్వతంత్రంగానే పెట్టుబడి పెట్టామని ఎల్ఐసీ స్పష్టం చేసింది. మరోవైపు 30 కోట్ల LIC వాటాదారుల కష్టార్జితాన్ని మోదీ దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.
News October 26, 2025
పెట్టుబడులపై ఆరోపణలు.. కంపెనీల్లో LIC వాటాలు ఇలా!

₹41 లక్షల కోట్ల ఆస్తులున్న LIC దేశంలోని టాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. వీటి విలువ 2014లో ₹1.56 లక్షల కోట్లు కాగా, ఇప్పుడు 10 రెట్లు పెరిగి ₹15.6 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుతం పలు కంపెనీల్లో వాటాలు ఇలా.. TCS-5.02%(₹5.7 లక్షల కోట్లు) *రిలయన్స్-6.94%(₹1.33 లక్షల కోట్లు) *ITC-15.86%(₹82వేల Cr)*SBI-9.59%(79,361 కోట్లు) *HDFC బ్యాంకు-4.89%(₹64,725 Cr ) *అదానీ గ్రూపు-4% (₹60వేల Cr).


