News August 28, 2025

నేడు జపాన్‌ పర్యటనకు ప్రధాని మోదీ

image

ప్రధాని మోదీ ఇవాళ అర్ధరాత్రి జపాన్‌కు బయలుదేరనున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో అక్కడ పర్యటించి 15వ ఇండియా-జపాన్ యాన్యువల్ సమ్మిట్‌లో పాల్గొంటారు. జపనీస్ PM ఇషిబాతో సమావేశమై ఇరు దేశాల దౌత్య, ట్రేడ్ సంబంధాలపై చర్చిస్తారు. 2018 తర్వాత మోదీ జపాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. 2014లో ఆయన PMగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు జపాన్‌లో పర్యటించారు.

Similar News

News August 28, 2025

సెలవుపై ముందే నిర్ణయం తీసుకోవచ్చుగా.. నెటిజన్ల సూచన

image

భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పదికి పైగా జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కొన్ని జిల్లాల్లో లేటుగా తీసుకున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. చాలాచోట్ల స్కూళ్లకు పిల్లలు, టీచర్లు చేరుకున్నాక సెలవు ప్రకటించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాతావరణ శాఖ నుంచి సూచనలు తీసుకుని ముందు రోజే సెలవుపై నిర్ణయం తీసుకోవడం అంత కష్టమా అంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News August 28, 2025

రేవంత్ గెటప్‌లోని వినాయక విగ్రహం తొలగింపు

image

TG: హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం హబీబ్‌నగర్‌లో CM రేవంత్‌ గెటప్‌లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో సౌత్ వెస్ట్ DCP మండపాన్ని సందర్శించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దంటూ నిర్వాహకుడు సాయికుమార్‌ను హెచ్చరించారు. పోలీసుల ఆదేశాల మేరకు ఆ విగ్రహాన్ని తొలగించి మరొకటి ఏర్పాటు చేశారు. అంతకుముందు దీనిపై MLA రాజాసింగ్ పోలీసులకు <<17538582>>ఫిర్యాదు<<>> చేశారు.

News August 28, 2025

నాలుగు జిల్లాలకు RED ALERT

image

TG: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 20 గంటల పాటు అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిగతా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని వెల్లడించింది. కాగా నిన్న కురిసిన వర్షాలకు నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.