News December 18, 2024

21న ప్రధాని మోదీ కువైట్ పర్యటన

image

ఈ నెల 21, 22 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ కువైట్‌లో పర్యటిస్తారు. ఆ దేశ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ పర్యటించనున్నారు. కువైట్ ఉన్నతాధికారులు, ప్రవాస భారతీయులతో ఆయన భేటీ అవుతారు. కాగా కువైట్‌ను చివరిసారి 1981లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సందర్శించారు. మళ్లీ 43 ఏళ్ల తర్వాత మోదీ అక్కడికి వెళ్తున్నారు. కువైట్‌లో దాదాపు 10 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.

Similar News

News October 16, 2025

పీరియడ్స్ వాయిదా వేసే టాబ్లెట్స్ వాడుతున్నారా?

image

ప్రస్తుతకాలంలో చాలామంది పీరియడ్స్ పోస్ట్‌పోన్ చేసే టాబ్లెట్లు వాడుతున్నారు. కానీ వీటిని ఎక్కువగా వాడటం వల్ల ప్రెగ్నెన్సీలో సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో గర్భస్థ శిశువుకి జననేంద్రియ లోపాలు రావచ్చంటున్నారు. కాబట్టి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే మహిళలు వీటిని వాడకపోవడం మంచిది. ఒకవేళ వాడాల్సి వస్తే డాక్టర్‌ సలహా మేరకు వాడడం మంచిదని సూచిస్తున్నారు.

News October 16, 2025

ఈ నెల 23న ఉద్యోగ మేళా

image

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లెలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇందులో 10 MNC కంపెనీలు పాల్గొననున్నాయి. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ అర్హతలు గల అభ్యర్థులు హాజరుకావొచ్చు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

News October 16, 2025

కాసేపట్లో మీనాక్షితో సురేఖ భేటీ

image

TG: వివాదం <<18019826>>వేళ<<>> మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్‌ నుంచి పిలుపొచ్చింది. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని సురేఖను మీనాక్షి ఆహ్వానించారు. కాసేపట్లో మంత్రి అక్కడికి వెళ్లనున్నారు. మరోవైపు సురేఖతో అధిష్ఠానం మంత్రి పదవికి రాజీనామా చేయించనుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.