News April 22, 2025

నేడు సౌదీ పర్యటనకు ప్రధాని మోదీ

image

ప్రధాని మోదీ ఇవాళ సౌదీ అరేబియాకు బయలుదేరనున్నారు. సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు జెడ్డాలో ఆయన రెండు రోజులు పర్యటించనున్నారు. మోదీ, సల్మాన్ భేటీ రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ పర్యటనలో భారీ సంఖ్యలో ఒప్పందాలపై సంతకాలతో పాటు ఆర్థిక, మిలిటరీ భాగస్వామ్యం, రాజకీయ సంబంధాలపై చర్చ జరగనుందని సౌదీలోని భారత అంబాసిడర్ అజాజ్ ఖాన్ వెల్లడించారు.

Similar News

News January 27, 2026

KNR: బస్టాండ్ ఆవరణలో శ్రీ మేడారం జాతర క్యాంపు

image

మేడారం జాతర భక్తుల కోసం కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపును రీజినల్ మేనేజర్ బి.రాజు ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని 6 కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సర్వీసుల్లోనూ మహిళలకు ‘మహాలక్ష్మి’ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందన్నారు. ఇతర భక్తులకు పెద్దలకు రూ.390, పిల్లలకు రూ.220 చొప్పున ఛార్జీలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

News January 27, 2026

బంగ్లాకు మళ్లీ షాకిచ్చిన ఐసీసీ

image

భద్రతా కారణాలతో ఇండియాలో T20 WC <<18949789>>ఆడబోమన్న<<>> బంగ్లాదేశ్‌కు ICC మరోసారి షాక్ ఇచ్చింది. ఆ దేశ జర్నలిస్టులకు మీడియా అక్రెడిటేషన్లు నిరాకరించింది. ‘ఇండియాకు వెళ్లడం సురక్షితం కాదని బంగ్లా ప్రభుత్వం చెబుతోంది. అందుకే అక్కడి జర్నలిస్టులకు వీసాలు/అక్రెడిటేషన్లు ఇవ్వలేదు’ అని ఓ ICC అధికారి చెప్పినట్లు NDTV తెలిపింది. 130-150 మంది జర్నలిస్టులు అప్లై చేసుకోగా ఒక్కరికీ ఐసీసీ పర్మిషన్ ఇవ్వలేదని సమాచారం.

News January 27, 2026

NIRDPRలో 98 ఉద్యోగాలు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్& పంచాయతీ రాజ్( NIRDPR)లో 98 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. PG అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50. నెలకు Sr. కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్‌కు రూ.75K, కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్‌కు రూ.60K చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: career.nirdpr.in/