News January 7, 2025
తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ

రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ, ఆ విషయాన్ని రెండు రాష్ట్రాల భాషల్లో ట్వీట్ చేశారు. ‘విశాఖపట్నంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటాను. విశాఖపట్నం ప్రజల మధ్య సమయం గడిపేందుకు ఎదురుచూస్తున్నాను. అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమ, కృష్ణ పట్నం పారిశ్రామిక ప్రాంతం (KRIS సిటీ) శంకుస్థాపన కార్యక్రమాలలో కూడా పాల్గొంటాను’ అని పేర్కొన్నారు.
Similar News
News September 1, 2025
అధికారులపై అవినీతి ఆరోపణలు.. CM సీరియస్

TG: కొందరు అధికారులు భవన నిర్మాణాలకు అనుమతుల విషయంలో అలసత్వం వహిస్తున్నారని CM రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే వారు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ‘బిల్డ్ నౌ’ అనుమతులపై CM సమీక్ష నిర్వహించారు. ‘పర్మిషన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తున్న ఆఫీసర్లను సరెండర్ చేయాలి. అలాగే ఇరిగేషన్ అధికారులపై పలు ఆరోపణలు వస్తున్నాయి. అధికారులపై అవినీతి ఆరోపణలు సహించేది లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.
News September 1, 2025
కవితపై బీఆర్ఎస్ శ్రేణుల ఫైర్

TG: BRS పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? అన్న <<17582811>>కవితపై<<>> ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. లిక్కర్ స్కాం కేసు సమయంలో కార్యకర్తలు మద్దతుగా నిలిచారని, SMలో తప్పుడు ప్రచారాలను ఖండించారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు KCR పెట్టిన పార్టీనే విమర్శించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అటు పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని, కావాలనే ఆమెను సైడ్ చేస్తున్నారని కవిత అభిమానులు అంటున్నారు. మీ కామెంట్?
News September 1, 2025
త్వరలో ‘పెద్ది’ నుంచి ఫస్ట్ సింగిల్

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఈ విషయాన్ని చరణ్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటో రిలీజ్ చేసి తెలిపారు. ఇందులో చరణ్, బుచ్చిబాబు సాన, ఏఆర్ రెహ్మాన్ ఉన్నారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానున్నట్లు టాక్.