News September 30, 2024

ఖర్గేకు ప్రధాని మోదీ పరామర్శ

image

కశ్మీర్‌లో ఎన్నికల ర్యాలీ సమయంలో స్వల్ప అనారోగ్యంపాలైన AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను PM మోదీ ఫోన్‌లో పరామర్శించారు. ఖర్గే పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారని పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. కాగా.. మోదీని దించేవరకూ తాను చావనని కశ్మీర్ సభలో ఖర్గే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘నాకు 83 ఏళ్లు. కానీ అంత సులువుగా చావను. మీ కోసం ఈ ప్రభుత్వంతో పోరాడతాను’ అంటూ ఖర్గే ఆ ప్రసంగంలో నిప్పులు చెరిగారు.

Similar News

News December 3, 2025

నామినేషన్ల కేంద్రాలను తనిఖీ చేసిన ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ బుధవారం పరిశీలించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆమె తనిఖీ చేశారు. నామినేషన్‌తోపాటు అభ్యర్థి నూతన బ్యాంక్ ఖాతా కచ్చితంగా కలిగి ఉండాలని, అన్ని వివరాలు నింపాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సూచించారు. హెల్ప్ డెస్క్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

News December 3, 2025

APPLY NOW: IIFTలో ఉద్యోగాలు

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారన్ ట్రేడ్‌ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. కార్పొరేట్ రిలేషన్స్&కెరీర్ అడ్వాన్స్‌మెంట్ కోఆర్డినేటర్(3) పోస్టులకు ఈనెల 11వరకు, రీసెర్చ్ అసోసియేట్, కేస్ స్టడీ మేనేజర్ పోస్టులకు ఈనెల 13వరకు, గ్రాఫిక్ డిజైనర్ పోస్టుకు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA/PGDBM/PG, PhD, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అర్హులు. వెబ్‌సైట్: www.iift.ac.in

News December 3, 2025

PM మోదీకి CM రేవంత్ అందించిన వినతులివే

image

⋆HYD​ మెట్రో రెండో దశ విస్తరణను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్​ వెంచర్​గా చేపట్టేందుకు ఆమోదించాలి
⋆RRR ఉత్తర, దక్షిణ భాగం​ నిర్మాణానికి, మన్ననూర్​-శ్రీశైలం 4 వరుసల ఎలివేటేడ్​ కారిడార్‌కు అనుమతులివ్వాలి. RRR వెంట రీజనల్​ రింగ్​ రైలు ప్రాజెక్టును చేపట్టాలి
⋆HYD-అమరావతి-మచిలీపట్నం​ పోర్ట్ 12 లేన్ల​ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ హైవే, HYD-BLR గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ వే నిర్మాణానికి చొరవ చూపాలి