News March 9, 2025
RRRకు త్వరలో ప్రధాని మోదీ భూమిపూజ: కిషన్ రెడ్డి

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR)కు త్వరలో PM మోదీ భూమి పూజ చేస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు భూసేకరణకు నిధులు లేవన్నా తానే నితిన్ గడ్కరీని ఒప్పించినట్లు చెప్పారు. కొద్దిరోజుల్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందుతుందని తెలిపారు. RRRకు తమ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉండగా కేవలం రూ.100కోట్లే ఇచ్చి కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించారు.
Similar News
News March 9, 2025
రేపు అమలక ఏకాదశి.. ఏం చేయాలంటే?

ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశి ‘అమలక ఏకాదశి’. అమలక అంటే ఉసిరికాయ అని అర్థం. ఈరోజున విష్ణుమూర్తి ఉసిరి చెట్టులో నివాసం ఉంటారని నమ్మకం. అందుకే ఉపవాసం ఉండి ఉసిరి చెట్టును పూజిస్తే పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అన్నదానం, గోదానం, వస్త్రదానం, ఉసిరి, నల్ల నువ్వులు వంటివి దానం చేస్తే మంచిదని పేర్కొన్నారు. సాయంత్రం చంద్ర దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించవచ్చు.
News March 9, 2025
4 క్యాచ్‌లు మిస్ చేసిన భారత్

CT ఫైనల్‌లో భారత ఫీల్డింగ్ పేలవంగా ఉంది. కివీస్ బ్యాటర్లు ఇచ్చిన 4 క్యాచ్‌లను వదిలేశారు. షమీ, అయ్యర్, రోహిత్, గిల్ క్యాచ్‌లను వదిలేయడంతో కివీస్ నెమ్మదిగా స్కోర్ పెంచుకుంటూ వెళ్తోంది. జట్టులో అద్భుతమైన క్యాచ్‌లు అందుకొనే ఫీల్డర్లు కూడా పేలవ ప్రదర్శన చేయడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. NZ స్కోర్ 37.5 ఓవర్లకు 165/5గా ఉంది.
News March 9, 2025
రోహిత్ రిటైర్మెంట్ వార్తలు.. గంగూలీ ఏమన్నారంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని వస్తున్న వార్తలపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించారు. ‘ఈ చర్చ అవసరం ఏముంది? కొద్ది నెలల క్రితమే అతడు దేశానికి వరల్డ్ కప్ అందించారు. బాగా ఆడుతున్నాడు. సెలక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు. 2027 వన్డే WCలోనూ రోహిత్ ఆడితే బాగుంటుంది. గత మ్యాచ్ ప్రదర్శనే రిపీట్ చేస్తే ఇవాళ కప్ మనదే’ అని వెల్లడించారు.