News March 20, 2024
జెలెన్స్కీకి ప్రధాని మోదీ ఫోన్ కాల్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. ఫోన్ కాల్ ద్వారా వీరు ఇరు దేశాల బంధం బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. రష్యాతో యుద్ధం విషయం ప్రస్తావనకు రాగా చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలని జెలెన్స్కీకి మోదీ సూచించారు. ఇరు పక్షాల మధ్య జరిగే శాంతి నెలకొల్పేందుకు భారత్ తన వంతు కృషి చేస్తుందన్నారు. కాగా భారత్ అందిస్తున్న సాయానికి జెలెన్స్కీ మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 20, 2025
ఎగుమతులకు రష్యా చమురు కొనుగోలు చేయం: రిలయన్స్

రష్యా నుంచి కొనుగోలు చేయని చమురును మాత్రమే శుద్ధి చేసి ఎగుమతి చేస్తామని రిలయన్స్ వెల్లడించింది. ఎగుమతులకు ఉపయోగించే చమురు కొనుగోళ్లను నేటి నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి రష్యా నుంచి కొనుగోలు చేయని చమురును మాత్రమే శుద్ధి చేసి ఎగుమతి చేయనున్నట్టు తెలిపింది. అయితే, భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని రిలయన్స్ ప్రతినిధి తెలిపారు.
News November 20, 2025
జగన్ జైలుకెళ్లడం ఖాయం: మంత్రి సత్యకుమార్

AP: పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ కోర్టులను మభ్యపెట్టలేరని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ‘విచారణలో భాగంగా కోర్టులకు హాజరయ్యేవారు వినయంగా వ్యవహరిస్తారు. తాను కోర్టుకు హాజరైతే సమస్యలు ఎదురవుతాయని కోర్టును నమ్మబలికే ప్రయత్నంలో భాగంగానే HYDలో నానా హంగామా చేశారు. జగన్లో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. అక్రమాస్తుల కేసులో ఆయన జైలుకు వెళ్లడం ఖాయం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
News November 20, 2025
పొగిడిన నోళ్లే తిడుతున్నాయ్.. కరెక్టేనా?

రాజమౌళి.. మొన్నటి వరకు తెలుగు సినీ కీర్తిని ప్రపంచ వేదికపై రెపరెపలాడించిన వ్యక్తి. బాలీవుడ్ ఆధిపత్యాన్ని ఎదురించి సౌత్ సినిమాను దేశవ్యాప్తం చేసిన డైరెక్టర్. కానీ ఇప్పుడు.. ఆస్కార్ తెచ్చాడని పొగిడిన నోళ్లే నేలకు దించేస్తున్నాయి. ప్రశంసించిన వాళ్లే విమర్శిస్తున్నారు. ‘దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు’ అన్న ఒకేఒక్క మాట జక్కన్నను పాతాళానికి పడేసిందా? అంతరాత్మ ప్రభోదానుసారం మాట్లాడటం తప్పంటారా? COMMENT


