News March 17, 2024

చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే.!

image

చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద నేడు జరగనున్న TDP కూటమి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు PM మోదీ హజరవుతుండగా, పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఈ సాయంత్రం 4.10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 5 నుంచి 6 గంటల వరకు ప్రసంగిస్తారు. 6.10 గంటలకు తిరుగుపయనమవుతారు. 6.55 గంటలకు గన్నవరం చేరుకొని, 7కు హైదరాబాద్ వెళతారు.

Similar News

News April 4, 2025

అమరావతికి మోదీ రాక.. ఏర్పాట్లు షురూ 

image

అమరావతి రాజధాని ప్రాంతానికి PM మోదీ ఈనెలలో రానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు SP సతీశ్ గురువారం వెలగపూడి సచివాలయం సమీపంలో హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా మోదీ రాక కోసం మూడు హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కార్యక్రమంలో తుళ్లూరు DSP మురళీకృష్ణ, MRO సుజాత, సీఐలు శ్రీనివాసరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు. 

News April 3, 2025

11వ తేదీలోగా అభ్యంతరాలు తెలపండి: డీఈవో 

image

అర్హులైన ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పించేందుకు సీనియారిటీ జాబితా సిద్ధమైంది. సీనియారిటీ జాబితా విద్యాశాఖ వెబ్ సైట్‌లో ఉంచడం జరిగిందని డీఈవో రేణుక చెప్పారు. సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 11వ తేదీలోగా తెలపాలని సూచించారు. ఈ మేరకు డీఈవో రేణుక గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పారదర్శకంగా ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ సాగుతుందన్నారు. 

News April 3, 2025

గుంటూరు: వృద్ధురాలిపై కర్రలతో దాడి.. మృతి

image

గుంటూరు నగరంలోని ఆనందపేటలో రెండు వర్గాల మధ్య గురువారం ఘర్షణ జరిగింది. పాత కక్షల నేపథ్యంలో హర్షద్ కుటుంబ సభ్యులపై ఫిరోజ్, ఫరోజ్‌తో పాటు మరికొందరు దాడి చేశారు. ఈ దాడిలో షేక్ ఖాజాబీ(75) మరణించింది. హర్షద్ తల్లిదండ్రులు షాజహాన్, బాబులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ఆ ప్రాంతంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

error: Content is protected !!