News November 22, 2024

ముగిసిన ప్రధాని నరేంద్రమోదీ 3 దేశాల పర్యటన

image

ప్రధాని నరేంద్రమోదీ మూడు దేశాల పర్యటన ముగిసింది. గయానాలోని జార్జిటౌన్ నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరారు. మొదట ఆయన నైజీరియా వెళ్లారు. అక్కడి నుంచి G20 సమ్మిట్ కోసం బ్రెజిల్ వచ్చారు. సమావేశాలు ముగిశాక ద్వీప దేశమైన గయానాకు చేరుకున్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాలు, రక్షణ సహా పది ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అక్కడి భారతీయులను కలిసి ముచ్చటించారు. ఆయా దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకోవడం తెలిసిందే.

Similar News

News November 22, 2024

చరిత్రలో ఎవరూ చేయని తప్పులు చేశారు: CBN

image

AP: చరిత్రలో ఎవరూ చేయని తప్పులు గత సీఎం జగన్ చేశారని CM చంద్రబాబు అన్నారు. వ్యవస్థలు విధ్వంసమయ్యాయని, అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని మండిపడ్డారు. నమ్మిన అసత్యాలను పదే పదే చెప్పి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. అందుకే విజన్ డాక్యుమెంట్ -2047పేరుతో షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రౌడీ రాజకీయాలు చేస్తామంటే పెట్టుబడిదారులు రాష్ట్రానికి రారని సీఎం తెలిపారు.

News November 22, 2024

హిందీ వెర్షన్‌లో ‘దేవర’

image

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్-డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ హిందీ వెర్షన్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కీలకపాత్రలు పోషించారు.

News November 22, 2024

PAC ఎన్నికపై మండలిలో నిరసన

image

AP: పీఏసీ ఎన్నికపై శాసనమండలిలో YCP సభ్యులు నిరసన తెలిపారు. వేరే సభలో అంశం ఇక్కడ వద్దని మండలి ఛైర్మన్ వారిని వారించారు. దీంతో వారు మండలి నుంచి వాకౌట్ చేశారు. జగన్ ఎందుకు ఓటింగ్‌కు రాలేదని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు. ఎందుకు వాకౌట్ చేస్తున్నారో క్లారిటీ ఇవ్వాలని కోరారు. అటు అసెంబ్లీలో వివిధ కమిటీ సభ్యుల ఎన్నికకు ఇప్పటి వరకు 163మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. సీఎం చంద్రబాబు ఓటింగ్‌లో పాల్గొన్నారు.